పవర్ స్టార్ వజ్రాల దొంగ!

మొఘల్ కాలం నాటి కథతో పవన్-క్రిష్ సినిమా తెరకెక్కుతోందనే విషయాన్ని ఇప్పటికే నాగబాబు రివీల్ చేశారు. ఇప్పుడీ సినిమాకు సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ మేటర్ బయటకొచ్చింది. పీరియాడిక్ డ్రామాగా వస్తున్న ఈ సినిమాలో ప్రపంచంలోకెల్లా అత్యంత ఖరీదైన వజ్రాన్ని దొంగిలించే కాన్సెప్ట్ తో ఈ సినిమా రాబోతోందట. ఈ క్రమంలో బోలెడన్ని థ్రిల్లింగ్ సీక్వెన్స్ లు కూడా వస్తాయట.

ఈ సినిమాలో పనవ్ దొంగగా కనిపించబోతున్నాడనే విషయం ఇప్పటికే బయటకొచ్చింది. తాజా లీకుల బట్టి చూస్తే.. సినిమాలో ఆ ఖరీదైన వజ్రాన్ని దొంగిలించేది పవన్ కల్యాణ్ అనే విషయం అర్థమౌతూనే ఉంది. ఈ సినిమా కోసం హైదరాబాద్ చుట్టుపక్కనల భారీ సెట్స్ నిర్మాణం జరుగుతోంది. లాక్ డౌన్ ముగిసి, గవర్నమెంట్ నుంచి అనుమతి వచ్చిన వెంటనే షూట్ స్టార్ట్ చేస్తారు.

పవన్ రీఎంట్రీ మూవీ వకీల్ సాబ్. ఈ సినిమా స్టోరీలైన్ పై పెద్దగా ఎవ్వరికీ పట్టింపు లేదు. ఎందుకంటే ఇది రీమేక్ సినిమా. ఇప్పటికే చాలామంది హిందీలో, మరికొంతమంది తమిళ్ లో చూసేసి ఉన్నారు. అందుకే పవన్-క్రిష్ సినిమా కథపై అందరి ఫోకస్ పడింది. ఈ సినిమాకు విరూపాక్ష అనే టైటిల్ అనుకుంటున్నారు.