గతం గతః అంటున్న బాలయ్య

Balakrishna about new movie

సింహా, లెజెండ్ లాంటి రెండు బ్లాక్ బస్టర్స్ తర్వాత కలిశారు. దీంతో బాలయ్య-బోయపాటి సినిమాపై భారీ అంచనాలున్నాయి. అయితే తనకు మాత్రం అలాంటి ఫీలింగ్స్ లేవంటున్నాడు బాలయ్య. గతం గతః అంటున్నాడు. కొత్త సినిమా లాంఛ్ సందర్భంగా బాలయ్య ఈ వ్యాఖ్యలు చేశాడు.

సింహా, లెజెండ్ సినిమాల ప్రభావం తమ కాంబినేషన్ పై ఉండదని.. ఎప్పట్లానే ఓ కొత్త ప్రాజెక్టులానే ఈ సినిమాను చూస్తామని ప్రకటించాడు. అన్ని సినిమాలు కథల నుంచి పుడితే, బోయపాటితో తను చేసే ఏ సినిమా అయినా ఆవేశం నుంచి పుడుతుందని ప్రకటించుకున్నాడు బాలయ్య. తామిద్దరికి చాలా ఆవేశం ఉందని, డైలాగ్స్ అయినా, కథ అయినా ఆ ఆవేశం నుంచే పుడుతుందంటున్నాడు.

ఈ సినిమాలో హీరోయిన్ ను ఇంకా ఫిక్స్ చేయలేదు. ప్రస్తుతం రూలర్ సినిమా డబ్బింగ్ లో ఉన్నాడు బాలయ్య. ఈ సినిమా థియేటర్లలోకి వచ్చిన తర్వాత, జనవరి నుంచి బోయపాటి సినిమా సెట్స్ పైకి వస్తుంది. తమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.