మహర్షి వల్ల నరేష్ కి యూజ్ లేదు!

రీసెంట్ గా మహర్షిలో మంచి పాత్ర పోషించాడు అల్లరి నరేష్. మహర్షి వాళ్ళ ఎలాంటి ఉపయోగం కలగలేదు. కొత్తగా అలంటి మంచి రోల్ …వేరే హీరో సినిమాలు రాలేదు. మల్టి స్టార్రర్ సినిమాలు వస్తాయి అనుకుంటే.. ఒక్కటి కూడా రాలేదు.

ఇప్పుడు మళ్లీ తన పాత పద్దతిలోనే హీరో వేషాలు వేస్తున్నాడు. ఓ కాన్సెప్ట్ బేస్డ్ సినిమాకు ఓకే చెప్పాడు ఈ హీరో. విజయ్ కనకమేడల ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. గతంలో ఇతడు హరీష్ శంకర్ దగ్గర వర్క్ చేశాడు. ఇప్పుడీ సినిమాతో డైరక్టర్ అవుతున్నాడు.

ప్రస్తుతం బంగారుబుల్లోడు సినిమా చేస్తున్నాడు అల్లరినరేష్. ఏకే ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై అనీల్ సుంకర నిర్మిస్తున్న సినిమా ఇది. అయితే అనీల్ సుంకర్ ఇప్పుడీ సినిమాపై ఫోకస్ తగ్గించాడు. అతడి దృష్టి మొత్తం ఇప్పుడు సరిలేరు నీకెవ్వరు ప్రాజెక్టుపై ఉంది. కాబట్టి.. మహేష్ సినిమా రిలీజైన తర్వాతే బంగారు బుల్లోడు థియేటర్లలోకి వస్తుందన్నమాట. అందుకే ఈ గ్యాప్ లో ఈ కాన్సెప్ట్ బేస్డ్ సినిమా స్టార్ట్ చేయబోతున్నాడు అల్లరి నరేష్.

ఈ సినిమాతో సతీష్ వేగేశ్న నిర్మాతగా పరిచయమౌతున్నాడు. అయితే అంతా అనుకుంటున్నట్టు ఇతడు శతమానంభవతి దర్శకుడు కాదు.  ఇతడు వేరే. `మోస‌గాళ్ల‌కు మోస‌గాడు`, `ఒక్క క్ష‌ణం` చిత్రాల‌కు కో ప్రొడ్యూస‌ర్‌గా వ్య‌వ‌హ‌రించిన స‌తీశ్ వేగేశ్న నిర్మాత‌గా మారి ఎస్‌వీ2 ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై ఈ చిత్రాన్నినిర్మించ‌బోతున్నారు. అదన్నమాట సంగతి.