ఇంతకీ ఆ చీప్ హీరో ఎవరో చెప్పరాదె!

Ajay Bhupati says cheap hero

ఇండస్ట్రీకి వివాదాలు కొత్తకాదు. మినిమం గ్యాప్ లో ఏదో ఒక వివాదం టాలీవుడ్ ను చుట్టుమడుతూనే ఉంటుంది. హీరో-హీరోకు మధ్య గొడవలు కామన్. ఎన్టీఆర్-మహేష్ అభిమానులు నిత్యం సోషల్ మీడియాలో గొడవలు పడుతూనే ఉంటారు. ఇక హీరో-దర్శకుడికి మధ్య గొడవ కూడా కామన్. రీసెంట్ గా మహేష్-సుకుమార్ వ్యవహారం దీనికి నిదర్శనం. ఇప్పుడిలాంటిదే మరో వివాదం తెరపైకి వచ్చింది. ఇక్కడ దర్శకుడు ఎవరనేది తెలుస్తూనే ఉంది. హీరో ఎవనేది మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది. 

కొన్ని గంటల కిందట ఓ ట్వీట్ పెట్టాడు దర్శకుడు అజయ్ భూపతి. ఆర్ఎక్స్100 సినిమాతో క్రేజ్ తెచ్చుకున్న ఈ దర్శకుడు ఓ ట్వీట్ పెట్టాడు. ఆ ట్వీట్ లో కేవలం చీప్ హీరో అని మాత్రం రాశాడు ఈ దర్శకుడు. అంతకుమించి ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. దీంతో ఇప్పుడీ ట్వీట్ పెద్ద సంచలనంగా మారింది. ఎవరా చీప్ హీరో అనే డిస్కషన్ జోరందుకుంది. 

ఆర్ఎక్స్100 తర్వాత మహాసముద్రం అనే స్క్రిప్ట్ రాసుకున్నాడు అజయ్. దీన్ని నాగచైతన్యతో తెరకెక్కించాలనుకున్నాడు. కానీ కొన్ని కారణాల వల్ల అది కార్యరూపం దాల్చలేదు. రీసెంట్ గా ఇది రవితేజ వద్దకెళ్లింది. రవితేజ-అజయ్ భూపతి కాంబో ఆల్ మోస్ట్ ఫిక్స్ అయింది. ఇక సెట్స్ పైకి వెళ్లడమే ఆలస్యం అనుకున్న టైమ్ లో ఈ సినిమా కూడా ఆగిపోయిందంటూ పుకార్లు వస్తున్నాయి. 

ఈ నేపథ్యంలో అజయ్ భూపతి, చీప్ హీరో అంటూ ట్వీట్ పెట్టడం కలకలం రేపింది. ఇంతకీ ఎవరా హీరో? దీనికి సమాధానం మరికొన్ని రోజుల్లో తెలిసిపోతుంది. అప్పటివరకు లెట్స్ వెయిట్ అండ్ సీ.