అల వైకుంఠపురంలో.. మరో రికార్డు

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం “అల వైకుంఠపురములో”. పలు విజయవంతమైన చిత్రాల్ని అందించిన భారీ నిర్మాణ సంస్థలు ‘హారిక అండ్ హాసిని క్రియేషన్స్’, ‘గీతాఆర్ట్స్’ కాంబినేషన్ లో ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల అవుతోంది. ఈ చిత్రం నుంచి విడుదల  అయిన మొదటిపాట ‘సామజవరగమన’ యూట్యూబ్ రికార్డులను తిరగరాస్తోంది. ఇప్పటికే 56 మిలియన్ వ్యూస్ దాటి 100 మిలియన్ వ్యూస్ వైపు పరుగులు పెడుతోంది. లైక్స్ విషయంలో కూడా ఈ పాట రికార్డులను తిరగరాస్తోంది.

ఇక దీపావళి సందర్భంగా విడుదలైన రెండో పాట ‘రాములో… రాముల’ గురించి కూడా ప్రత్యేకంగా ప్రస్తావించుకోవాలి. తొలి పాట బ్లాక్ బస్టర్ హిట్ కాగా, తొలి పాటను మించి రెండో సాంగ్ యూట్యూబ్ లో రికార్డులను తిరగరాస్తోంది. ‘సామజవరగమన’ తిరగరాసిన రికార్డులను దాటి ఈ పాట దూసుకుపోతోంది. విడుదలైన 24 గంటల్లో ఈ పాట దాదాపు 8.3 మిలియన్ వ్యూస్ సాధించి సౌత్ ఇండియాలోనే ఫస్ట్ 24 గంటల్లో మోస్ట్ వ్యూడ్ సాంగ్ గా కొత్త రికార్డును సెట్ చేసింది. లైక్స్ పరంగా కూడా ఇప్పటికే 340K  లైక్స్ వచ్చాయి.   సామజవరగమన పూర్తిగా క్లాస్ సాంగ్ కాగా, రాములో రాముల పార్టీ సాంగ్. మాస్ టచ్ తో సాగే ఈ సాంగ్ ప్రేక్షకులకు తొలిసారి విన్న దగ్గరనుండే బాగా నచ్చేస్తోంది.  అనురాగ్ కులకర్ణి, మంగ్లీ వాయిస్ లు కూడా ఈ పాటకు కనెక్ట్ అయ్యేలా చేస్తున్నాయి. ఇక కాసర్ల శ్యామ్ రాసిన క్యాచీ లిరిక్స్ పాటకు అసలైన ఆకర్షణగా మారాయి.