బన్నీ, నేను సెపెరేట్ అయ్యాము: అల్లు శిరిష్

హీరోలందర్లానే అల్లు శిరీష్ కూడా ఈ లాక్ డౌన్ టైమ్ లో ఇంటికే పరిమితమైపోయాడు. అలా అని అతడు తండ్రి అల్లు అరవింద్ తో కలిసి ఉండడం లేదు. ఒంటరిగా ఒక్కడే ఉంటున్నాడు. ఈ ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ తో పాటు.. బన్నీ గురించి కూడా శిరీష్ ఏం చెబుతున్నాడో చూద్దాం.

1. బన్నీ ఏం చేస్తున్నాడు?
బన్నీ బాగున్నాడు. మేమిద్దరం ఒకే ఇంట్లో ఉండడం లేదు. కొన్ని నెలల కిందట మా పేరెంట్స్ ఇంటి నుంచి బయటకొచ్చాను. ప్రస్తుతం ఒంటరిగా ఉన్నాను. బన్నీ మాత్రం అమ్మానాన్నతోనే ఉన్నాడు. ఈ లాక్ డౌన్ టైమ్ లో ఎక్కువగా పిల్లలతోనే గడుపుతున్నాడు బన్నీ.

2. మూడు భాషల్లో చేశారు కదా.. తేడా ఏం గమనించారు.?
తమిళం, తెలుగు, మలయాళ ఇండస్ట్రీస్ కు చాలా తేడా ఉంది. మలయాళం సినిమాలన్నీ సూపర్ ఫాస్ట్ గా కంప్లీట్ అవుతాయి. షాట్ పూర్తయి మనం కుర్చీలో కూర్చునేలోపే యూనిట్ మొత్తం మరో బ్లాక్ కు షిఫ్ట్ అయిపోతుంది. అంత ఫాస్ట్ గా ఉంటారక్కడ. మ్యాగ్జిమమ్ 40 రోజుల్లో మొత్తం పూర్తిచేస్తారు. తమిళ్ మూవీ మేకింగ్ కూడా డిఫరెంట్ గా ఉంటుంది. కాకపోతే తెలుగు-తమిళ ఫిలిం మేకింగ్ కాస్త దగ్గరగా ఉంటుంది.

3. ఫస్ట్ టైమ్ గజనీ మూవీకి వర్క్ చేశారు. ఆ వర్క్ ఎక్స్ పీరియన్స్ గురించి?
నాన్న గజనీ హిందీలో తీసే టైమ్ కు నేను ముంబయిలోనే ఉన్నాను. అక్కడ చదువుకుంటున్నాను. అందుకే ఆ సినిమాకు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా చేశాను. పైగా అది నాకు ఇంటర్న్ షిప్ గా పనిచేసింది. ఆ సినిమా టైమ్ లో మూవీకి సంబంధించి నేను ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదు. కాకపోతే ప్రతి డిపార్ట్ మెంట్ లో వర్క్ చేశాను.

4. బన్నీ నటించిన అల వైకుంఠపురములో హిందీలో రీమేక్ అవుతుందనే విషయం తెలుసా?
అల వైకుంఠపురములో సినిమా హిందీలో రీమేక్ అవుతుందని విన్నాను. కచ్చితంగా హిందీలో కూడా హిట్ అవుతుంది. ఎందుకంటే ఈమధ్య కాలంలో బాలీవుడ్ లో ఫుల్ లెంగ్త్ ఫ్యామిలీ ఎమోషన్స్ తో సినిమా రాలేదు. ఇది అలాంటి సినిమా అవుతుంది.

5. ఇంతకీ ఈ లాక్ డౌన్ టైమ్ లో ఏం చేస్తున్నారు?
ఈ లాక్ డౌన్ టైమ్ లో నేను ఇంట్రోవర్ట్ (అంతర్ముఖుడు)గా మారాడు. సాధారణంగా నేను ఎక్సట్రావర్ట్ ని. చాలా ఓపెన్ గా ఉంటాను. ఎక్కువ మాట్లాడతాను. ఈ లాక్ డౌన్ లో నేను ఒక్కడ్నే ఒంటరిగా ఉంటున్నాను. నాతో నేను మాట్లాడుకుంటున్నాను.