అనుష్క తప్పు చెయ్యలేదు!

ఆమధ్య అనుష్కపై ఓ పుకారు చెలరేగింది. ఆమె నటించిన నిశ్శబ్దం సినిమాను థియేట్రికల్ రిలీజ్ కంటే ముందే ఓటీటీకి ఇచ్చేద్దామని నిర్మాత ప్లాన్ చేశాడట. అయితే మరో బడా నిర్మాత కొడుకుతో లాబీయింగ్ చేయించి, అనుష్క ఆ ప్రయత్నాన్ని అడ్డుకుందట. తన సినిమా థియేటర్లలోనే ముందుగా రిలీజ్ అవ్వాలని, ఆ తర్వాతే స్ట్రీమింగ్ కు వెళ్లాలని అనుష్క గట్టిగా పట్టుబట్టిందట, నిర్మాతకు నష్టమొచ్చినా పట్టించుకోలేదట.

దాదాపు వారం రోజులుగా నలిగిన ఈ పుకారుపై ఎట్టకేలకు యూనిట్ స్పందించింది. అందులో ఎలాంటి నిజం లేదని ఖండించింది. పైపెచ్చు అనుష్క తమకు ఫుల్ కోపరేషన్ ఇస్తోందని చెప్పుకొచ్చింది సదరు నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ.

అనుష్క అయితే అన్ని విషయాల్లో ఫుల్ సపోర్ట్ గా నిలిచిందని పీపుల్ మీడియా నిర్మాతలు చెప్పుకొచ్చారు. తమ సినిమాకు సంబంధించి ఎలాంటి పుకార్లు నమ్మొద్దని, ఏదైనా ఉంటే అధికారికంగా ప్రకటిస్తామని తెలిపారు.