బాబోయ్ బాలయ్య ఏంటిది?

Balakrishna huge budget movie

తన సినిమాల లిమిట్ ఏంటి? అవి ఎంత మార్కెట్ చేస్తాయి? ఏ సెక్షన్ ఆడియన్స్ ఎక్కువగా చూస్తారు లాంటి విషయాల్లో చాలా క్లియర్ గా ఉంటాడు బాలయ్య. అందుకే బాలయ్య సినిమాలెప్పుడూ బడ్జెట్ దాటవు. అనుకున్న బడ్జెట్ లో, అనుకున్న టైమ్ కు వచ్చేస్తుంటాయి. కానీ ఫస్ట్ టైమ్ బాలయ్య బౌండరీస్ క్రాస్ చేస్తున్నాడు. కెరీర్ లోనే బారీ బడ్జెట్ సినిమా చేస్తున్నాడు.

త్వరలోనే బోయపాటి దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు బాలయ్య. ఈ సినిమాకు అక్షరాలా 60 కోట్ల రూపాయల బడ్జెట్ అనుకుంటున్నారట. ఇదే కనుక జరిగితే, నటసింహం కెరీర్  లో భారీ బడ్జెట్ సినిమా ఇదే అవుతుంది. తండ్రి పెద్ద ఎన్టీఆర్ పై తీసిన బయోపిక్ కు కూడా ఇంత ఖర్చుపెట్టలేదు బాలయ్య. బోయపాటి సినిమాకు మాత్రం 60 కోట్లు అనేసరికి ఓకే అన్నాడట. దీనికి కారణం కాంబినేషన్ మహత్యం.

బాలయ్య-బోయపాటి కాంబినేషన్ అదుర్స్. ఇంతకుముందు వీళ్లిద్దరి కాంబోలో వచ్చిన సింహా, లెజెండ్ సినిమాలు రెండూ బ్లాక్ బస్టర్స్ అయ్యాయి. అందుకే బిజినెస్ ప్రాబ్లమ్ ఉండదు కాబట్టి, హ్యాట్రిక్ మూవీకి కాస్త ఎక్కువే ఖర్చుపెట్టాలని ఫిక్స్ అయ్యారు. పైగా అక్కడున్నది డబ్బును నీళ్లలా ఖర్చుచేయించే బోయపాటి. ఇంకేముంది, బడ్జెట్ కాస్తా 60 కోట్లు అయింది.

ఈ సినిమాకు ముహూర్తం కూడా ఫిక్స్ చేశాడు బాలయ్య. ఈనెల 9న సినిమాను లాంచ్ చేసే అవకాశం ఉంది. 20 నుంచి రెగ్యులర్ షూటింగ్ కు వెళ్లాలనేది ప్లాన్.