
“కౌసల్య కృష్ణమూర్తి చిత్రం తమిళ్లో వచ్చిన ‘కనా’ సినిమాకు రీమేక్. శివకార్తికేయన్ గారే ఆ సినిమాకి నిర్మాత. తమిళంలో అంత పెద్ద హీరో అయుండి కూడా ఒక ఫిమేల్ ఓరియంటెడ్ మూవీని ప్రొడ్యూస్ చేయడం, అందులో గెస్ట్ రోల్లో నటించడం నిజంగా గొప్ప విషయం. తమిళంలో ఆ క్యారెక్టర్ బాగా చేయడం, ఆయనకు ఇంట్రెస్ట్ ఉండడంతో ఆ క్యారెక్టర్ వారితోనే చేపించడం జరిగింది. ఆ క్యారెక్టర్‌కి తెలుగులో కూడా మంచి అప్లాజ్ వస్తుంది.”
ఇలా ఓ అబద్ధాన్ని ఆసువుగా చెప్పేశాడు దర్శకుడు భీమనేని శ్రీనివాసరావు. రీమేక్ స్పెషలిస్ట్ గా పేరుతెచ్చుకున్న ఈ దర్శకుడు, ఈసారి కాపీ-పేస్ట్ స్పెషలిస్ట్ కూడా అనిపించుకున్నాడు. కౌసల్య కృష్ణమూర్తి రీమేక్ కోసం ఒరిజినల్ వెర్షన్ లో ఉన్న శివకార్తికేయన్ ఎపిసోడ్ ను యథాతథంగా కాపీ-పేస్ట్ చేశారు. ప్రత్యేకంగా షూటింగ్ చేయలేదు. ఆ రీల్ కు డబ్బింగ్ మాత్రం చెప్పించారు.
కానీ చూశారుగా భీమనేని మాత్రం తను శివకార్తికేయన్ ను డైరక్ట్ చేసినట్టు చెప్పుకుంటున్నాడు. కేవలం శివకార్తికేయన్ ఎపిసోడ్ మాత్రమే కాదు, సినిమాలో లీడ్ రోల్ పోషించిన ఐశ్వర్య రాజేష్ కు చెందిన కొన్ని సన్నివేశాల్ని కూడా యాజ్ ఇటీజ్ గా వాడుకున్నారు. ఇలా చాలా తక్కువ ఖర్చులో సినిమాను పూర్తిచేశారు. కానీ భీమనేని మాత్రం ఆ విషయం దాచేస్తున్నాడు. క్రెడిట్ అంతా తనదే అంటూ ప్రెస్ మీట్ పెట్టాడు. ఇంతా చేసి ఈ సినిమా హిట్ కాదు. థియేటర్లలో కౌసల్య కృష్ణమూర్తికి ఫ్లాప్ మార్కులు పడ్డాయి.