చిరంజీవి చేపల కర్రీ

తనలో డాన్సింగ్-యాక్టింగ్ టాలెంట్ మాత్రమే కాదు.. మంచి వంటగాడు కూడా ఉన్నాడనే విషయాన్ని తాజాగా బయటపెట్టారు మెగాస్టార్ చిరంజీవి. ఓ నేషనల్ మీడియాకు ఆన్ లైన్ లో ఇంటర్వ్యూ ఇచ్చిన చిరు.. రీసెంట్ గా తను దోశల వేసిన ఘటన నుంచి తన చెఫ్ అనుభవాల వరకు అన్నీ పంచుకున్నారు.

బి ద రియల్ మేన్ ఛాలెంజ్ లో భాగంగా తన అమ్మ కోసం దోశలు వేశారు చిరంజీవి. ఇదే విషయంపై మాట్లాడుతూ తనకు చాలా వంటకాలు చేయడం వచ్చని ప్రకటించారు. మరీ ముఖ్యంగా చేపల కూర, మటన్ ఫ్రై బ్రహ్మాడంగా చేస్తానంటున్నారు చిరు. వీటితో పాటు చైనీస్ వంటకాలైన నూడుల్స్, ఫ్రైడ్ రైస్ లాంటివి ఇరగదీస్తానని చెబుతున్నారు.

తను ఎప్పుడైనా ఒత్తిడి ఫీల్ అయినప్పుడు వంటిట్లోకి వెళ్లిపోతుంటానని, నచ్చిన వంటలు చేసేస్తుంటానని చెబుతున్నారు మెగాస్టార్. నిజానికి తనకు పెళ్లయిన కొత్తలో భార్య సురేఖకు అస్సలు వంట రాదని.. తనే ముందుగా ఉప్మా ఎలా చేయాలో నేర్పించానని కూడా అప్పటి విషయాల్ని గుర్తుకుతెచ్చుకున్నారు చిరు.