నా లస్ట్ స్టోరీస్ ఆ టైపు కాదు

Eesha Rebba Love Stories

లస్ట్ స్టోరీస్ అనే వెబ్ సిరీస్ ఎంత పాపులర్ అయిందో అందరికీ తెలిసిందే. మరీ ముఖ్యంగా ఆ సిరీస్ తోనే కైరా అద్వానీ ఓవర్ నైట్ లో స్టార్ అయిపోయింది. సెక్స్ సుఖం కోసం పరితపించే ఇల్లాలిగా కైరా యాక్టింగ్ నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంది. ఇక స్వయం తృప్తి కోసం కైరా చేసిన పని కూడా నెట్టింట్లో వైరల్ అయింది. అలాంటి సెన్సేషనల్ సిరీస్ లో ఇప్పుడు ఈషా రెబ్బా నటిస్తోంది.

లస్ట్ స్టోరీస్ తెలుగు వెర్షన్ లో ఈషా రెబ్బా నటిస్తుందనగానే అంతా అది కైరా అద్వానీ రోల్ అనుకున్నారు. హిందీలో కియరా చేసిన పాత్రను తెలుగులో ఈషా చేస్తోందని భావించారు. కానీ కియరా పాత్రకు తనకు ఎలాంటి సంబంధం ఉండదని స్పష్టంచేసింది ఈషా రెబ్బా. ఇంకా చెప్పాలంటే, హిందీ లస్ట్ స్టోరీస్ కు, తెలుగులో వస్తున్న లస్ట్ స్టోరీస్ కు చాలా వ్యత్యాసం ఉంటుందని కూడా అంటోంది

తెలుగులో లస్ట్ స్టోరీస్ కు చెందిన 2 ఎపిసోడ్స్ ను ఘాజి ఫేం సంకల్ప్ రెడ్డి డైరక్ట్ చేస్తున్నాడు. అతడి డైరక్షన్ లోనే ఈషా నటిస్తోంది. ఆల్రెడీ ఒక ఎపిసోడ్ షూటింగ్ కూడా పూర్తయిందని నిర్థారించిన ఈషా.. తెలుగు లస్ట్ స్టోరీస్ లో తను హాట్ గా కనిపిస్తాను తప్ప, కియరా టైపులో ఎరోటిక్ గా మాత్రం కనిపించనని స్పష్టంచేసింది.