ఆ మేటర్ లో నిజం లేదు

సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రస్తుతం శివ డైరెక్షన్ లో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో గోపీచంద్ ఓ నెగిటివ్ రోల్ చేస్తున్నాడనే రూమర్ హల్ చల్ చేసింది. తాజాగా ఈ విషయంపై ఓ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చాడు గోపీచంద్. తను రజనీకాంత్ సినిమాలో నటిస్తున్నాననే మేటర్ లో నిజం లేదంటున్నాడు.

దర్శకుడు శివ గతంలో తనతో సినిమాలు చేయడం వల్లే ఈ రూమర్ పుట్టిందంటున్నాడు గోపీచంద్.
ప్రస్తుతం సంపత్ నంది డైరెక్షన్ లో చేస్తున్న ‘సీటీమార్’ కి సంబంధించి యాబై శాతం షూటింగ్ పూర్తయిందని తెలిపాడు. లాక్ డౌన్ ముగిసిన వెంటనే రిలీజ్ డేట్ ను అధికారికంగా ప్రకటిస్తామంటున్నాడు.

ఇక డైరక్టర్ తేజతో ఎప్పటి నుండో ఓ సినిమా చేయాలనుకుంటున్న గోపీచంద్, ఇప్పుడు అదే పనిలో ఉన్నాడు. ‘అలివేలు మంగ వెంకటరత్నం’ అనే కథను గోపీచంద్ కు వినిపించాడు తేజ. ఈ కథకు గోపీచంద్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ ను అఫీషియల్ గా ఎనౌన్స్ చేస్తారు.