ఒకప్పుడు లవర్.. ఇప్పుడు ఫ్రెండ్

తన మాజీ లవర్ శింబుపై మరోసారి క్లారిటీ ఇచ్చింది ఆపిల్ పిల్ల హన్సిక. ఒకప్పుడు శింబుతో పీకల్లోతు ప్రేమాయణం సాగించిన ఈ ముద్దుగుమ్మ.. ఇప్పుడు అతడు కేవలం తనకు మంచి స్నేహితుడు మాత్రమే అంటోంది. ఇంకా గట్టిగా అడిగితే.. మాజీ ప్రేమికులు ఫ్రెండ్స్ గా ఉండకూడదా అని రివర్స్ లో ప్రశ్నిస్తోంది.

ఈ క్వారంటైన్ టైమ్ లో తన అభిమానులతో మాట్లాడిన హన్సిక.. శింబును పొగడ్తల్లో ముంచెత్తింది. టైమ్ కు వస్తాడని, తన పనేదో తాను చూసుకొని వెళ్లిపోతాడని, క్రమశిక్షణతో ఉంటాడని మెచ్చుకుంటోంది.

శింబు-హన్సిక ఎపైర్ గురించి అప్పట్లో కథలుకథలుగా చెప్పుకునేవాళ్లు. వాళ్లు కూడా ఓ దశలో తమ ప్రేమ వ్యవహారాన్ని దాచే ప్రయత్నం చేయలేదు. ప్రైవేట్ ఫొటోల్ని కూడా లీక్స్ రూపంలో విడుదల చేసి పడేశారు. విషయం పెళ్లి వరకు వెళ్లింది. సరిగ్గా అక్కడే వ్యవహారం బెడిసికొట్టింది. రెండు కుటుంబాల మధ్య పొసగక పెళ్లి వద్దనుకున్నారు. అప్పట్నుంచి శింబుకు దూరంగా ఉంటున్న హన్సిక, మళ్లీ ఇన్నేళ్లకు అతడికి దగ్గరైంది. ఇద్దరూ కలిసి ప్రస్తుతం ఓ సినిమా కూడా చేస్తున్నారు. అయితే ఈసారి మళ్లీ ప్రేమ చిగురించే అవకాశం లేదని, శింబు తనకు కేవలం ఓ మంచి ఫ్రెండ్ మాత్రమేనని అంటోంది హన్సిక.