బోల్డ్ అంటే ఏంటో కూడా నాకు తెలీదు: రెజీనా

బోల్డ్ అంటే ఏంటో కూడా నాకు తెలీదు: రెజీనా

బోల్డ్ అనే పదం ఇండస్ట్రీలో ఈమధ్య కామన్ అయిపోయింది. బోల్డ్ గా నటిస్తే అదో గొప్ప విషయం అయిపోయింది. హీరోలు, హీరోయిన్లు అనే తేడా లేకుండా అంతా తాము బోల్డ్ గా నటించామని చెప్పుకుంటున్నారు. చివరికి మన్మథుడు-2 సినిమాలో నాగ్ కూడా తను బోల్డ్ గా నటించానని చెప్పుకున్నాడు. 

ఓవైపు ఇంత జరుగుతుంటే హీరోయిన్ రెజీనా మాత్రం తనకు బోల్డ్ అంటే ఏంటో తెలియదంటోంది. తనకు తెలిసిందల్లా క్యారెక్టర్ కు తగ్గట్టు నటించడం మాత్రమేనని, బోల్డ్ లాంటి పదాల్ని తను పట్టించుకోనని చెబుతోంది. బాలీవుడ్ సినిమాలో లెస్బియన్ గా కనిపించిన రెజీనా, ఇలా బోల్డ్ అంటే ఏంటో తెలియదని అనడం కాస్త విడ్డూరమే.  

“బోల్డ్ అంటే ఏంటో నాకు అర్థం కావడం లేదు. మన ఇండస్ట్రీలో బోల్డ్ అనే పదాన్ని చాలా డిఫరెంట్ గా అర్థం చేసుకుంటున్నారు. బోల్డ్, క్లీన్, వల్గర్ అనే పదాల మధ్య చాలా చిన్న తేడా మాత్రమే ఉంది. ఆ లైన్ ఫాలో అయితే చాలు. నేను క్లీన్ గానే కనిపించాలనుకుంటున్నాను. వల్గర్ గా కాదు. నేను లెస్బియన్ గా నటించాను. అది బోల్డ్ అంటారు తప్ప వల్గర్ కాదు కదా.” 

ఎవరు సినిమా ప్రమోషన్ లో భాగంగా రెజీనా ఇలా రియాక్ట్ అయింది. ఈ సినిమాలో ఆమెపై ఓ రేప్ సీన్ కూడా ఉంది. ఆ సన్నివేశంలో చాలా బోల్డ్ గా నటించారు కదా అంటూ మీడియా ప్రశ్నించగా, తను బోల్డ్ గా నటించలేదని, సన్నివేశానికి తగ్గట్టు సహజంగా మాత్రమే ప్రవర్తించానని అంటోంది రెజీనా.