కామ్రేడ్ డీలా… ఇస్మార్ట్ ఖుషి

విజయ్ దేవరకొండ, రష్మిక జంటగా నటించిన డియర్ కామ్రేడ్ ఈనెల 26న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన సంగతి తెలిసిందే.  భారీ అంచనాలతో విడుదలైన ఈ చిత్రం అంచనాలను అందుకోలేకపోయింది.

గత వారం విడుదలైన ఇస్మార్ట్ శంకర్ చిత్రానికి మిశ్రమ స్పందన లభించటంతో పాటు మంచి కలెక్షన్స్ ను రాబడుతోంది. కాగా ఈ వారం డియర్ కామ్రేడ్ విడుదలవటంతో ఇస్మార్ట్ శంకర్ కలెక్షన్స్ పడిపోతాయని అంతా భావించారు.  కానీ డియర్ కామ్రేడ్ కి ఊహించినంత స్పందన రాకపోవటంతో, ఇక ఇస్మార్ట్ శంకర్ కి వచ్చే వారం వరకు తిరుగు లేదని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. 

ఇప్పటికే ఎనిమిది రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 61 కోట్ల గ్రాస్ వసూలు చేసిందని ఇస్మార్ట్ చిత్ర యూనిట్ ప్రకటించింది. దాదాపు 32 కోట్ల మేర షేర్ వసూలైంది. 

ఇలాగే వసూళ్లు సాగిస్తే త్వరలోనే 80 కోట్ల గ్రాస్ క్లబ్ లో చేరే ఇస్మార్ట్ శంకర్ చేరే వీలుందని టీమ్ అంచనా వేస్తోంది.