కాజల్, తమన్న విరాళాలు

లాక్ డౌన్ కారణంగా ఇబ్బంది పడుతున్న సినీకార్మికుల్ని ఆదుకునేందుకు ఎట్టకేలకు హీరోయిన్లు ఒక్కొక్కరుగా ముందుకొస్తున్నారు. టాలీవుడ్ లో లావణ్య త్రిపాఠి స్టార్ట్ చేసిన ఈ సంప్రదాయాన్ని తాజాగా కాజల్ కొనసాగించింది. చిరంజీవి నేతృత్వంలో కొనసాగుతున్న సీసీసీకి 2 లక్షల రూపాయల విరాళాన్ని ప్రకటించింది.

కాజల్ బాటలోనే తమన్న కూడా నడిచింది. కరోనా క్రైసిస్ ఛారిటీకి 3 లక్షల రూపాయల విరాళం ప్రకటించింది. ఇప్పటికే ప్రణీత కూడా విరాళం అందించిన సంగతి తెలిసిందే. లాక్ డౌన్ పొడిగించిన నేపథ్యంలో.. మరిన్ని విరాళాలు ఇవ్వాల్సిందిగా చిరంజీవి విజ్ఞప్తిచేశారు. దీంతో మరింతమంది హీరోయిన్లు ముందుకొచ్చే అవకాశం ఉంది.

కేవలం సీసీసీకి విరాళం ఇవ్వడమే కాకుండా.. ప్రధానమంత్రి సహాయనిధికి, మహారాష్ట్ర ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళం ప్రకటించింది కాజల్. దీంతో పాటు లాక్ డౌన్ తో ఇబ్బందిపడుతున్న తన ఇంటికి సమీపంలోని పేదలకు ప్రతిరోజూ అన్నదానం చేస్తోంది.