మోడీ మదర్ టంగ్ తో కమల్ హాసన్

Kamal Haasan

సిల్వర్ స్క్రీన్ పై ఎన్నో రకాల గెటప్స్ వేయడమే కాదు, ఎన్నో భాషలు మాట్లాడ్డంలో కూడా కమల్ దిట్ట. సౌత్ లోని అన్ని భాషల్లో కమల్ మాట్లాడగలడు. ఇక హిందీ, ఇంగ్లిష్ మాట్లాడ్డం కమల్ కు పెద్ద సమస్యే కాదు. వీటితో పాటు మరాఠీలో కూడా కొద్దిగా ప్రవేశం ఉంది. ఇన్ని భాషలపై పట్టున్న లోకనాయకుడికి ఇప్పుడు మరో భాష నేర్చుకునే పరిస్థితి వచ్చింది.

ప్రస్తుతం ఇండియన్-2 అనే సినిమా చేస్తున్నాడు ఈ సీనియర్ హీరో. ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాల్లో కథ ప్రకారం, కమల్ గుజరాతీ భాషలో మాట్లాడాలి. నిజానికి చెప్పాల్సిన డైలాగ్స్ వరకు భాష, దాని అర్థం తెలుసుకుంటే సరిపోతుంది. కానీ కమల్ అలా కాంప్రమైజ్ అయ్యే వ్యక్తికాదని మనకు తెలిసిందే కదా. అందుకే గుజరాతీపై కాస్త పట్టు కోసం ప్రయత్నిస్తున్నాడు హీరో. భాషపై కాస్త పట్టు వచ్చిన తర్వాత ఆ సన్నివేశాల్ని తీయాలని నిర్ణయించారు.

ప్రస్తుతం ఈ సినిమా షెడ్యూల్ మధ్యప్రదేశ్ లో జరుగుతోంది. కమల్, మరికొంతమంది ఫైటర్లపై కొన్ని యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. మధ్యలో పుట్టినరోజు కోసం కాస్త గ్యాప్ ఇచ్చినప్పటికీ, తిరిగి షెడ్యూల్ ను కొనసాగిస్తున్నారు. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కాజల్, రకుల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. సిద్దార్థ్ ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు.