ఆచార్య అప్ డేట్ ఇచ్చిన కొరటాల

కరోనా కారణంగా ఆచార్య సినిమా షూటింగ్ జరక్కపోయినా ఆ మూవీకి సంబంధించిన అప్ డేట్స్ ఇచ్చాడు దర్శకుడు కొరటాల శివ. ఈ సినిమా షూటింగ్ 40శాతం మాత్రమే పూర్తయిందని ప్రకటించిన కొరటాల.. నెక్ట్స్ షెడ్యూల్ కు రామ్ చరణ్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని అంటున్నాడు. అంతేకాదు.. సినిమాలో రామ్ చరణ్ కు కూడా హీరోయిన్ ఉందంటున్నాడు.

ఆచార్యలో ముందుగా త్రిషను అనుకున్నారు. కానీ ఆమె తప్పుకుంది. దీంతో చిరంజీవి సరసన మరోసారి కాజల్ ను హీరోయిన్ గా తీసుకున్నారు. ఇప్పుడు రామ్ చరణ్ కు కూడా హీరోయిన్ కావాలి. ఈసారి ఎవర్ని తీసుకుంటారో చూడాలి.

ఇక ఆచార్యకు సంబంధించి విదేశీ లొకేషన్లతో సంబంధం లేదని ప్రకటించాడు కొరటాల. సినిమా గ్రామీణ నేపథ్యంలో సాగుతుందని, మిగతా షెడ్యూల్స్ అన్నీ గ్రామీణ ప్రాంతాల్లో లేదంటే సెట్స్ లో పూర్తయిపోతాయని తెలిపాడు.

సినిమా షూటింగ్ ఇంకా 60శాతం పెండింగ్ ఉంది కాబట్టి ఆచార్య రిలీజ్ ఎప్పుడనేది అప్పుడే చెప్పడం చాలా కష్టం అంటున్నాడు ఈ దర్శకుడు.