తిండి-వంట-చదువు

ఈ లాక్ డౌన్ టైమ్ లో హీరోహీరోయిన్లంతా ఇళ్లకే పరిమితమైన వేళ హీరోయిన్ లావణ్య త్రిపాఠి కూడా తనకు ఇష్టమైన పనులు చేస్తూ బిజీగా గడిపేస్తోంది. ఎప్పట్నుంచో చదవాలనుకుంటున్న పుస్తకాల దుమ్ము దులుపుతోంది. పొద్దున లేస్తే వంట చేసుకోవడం, తిండి తినడం, చదువుకోవడం ఇదే తన పని అంటోంది లావణ్య.

ప్రస్తుతం సందీప్ కిషన్ సరసన ఎ-1 ఎక్స్ ప్రెస్ అనే సినిమా చేస్తున్న ఈ ముద్దుగుమ్మ.. సొసైటీ పట్ల అంతా బాధ్యతగా వ్యవహరించాలని కోరుతోంది. సినీకార్మికుల సంక్షేమం కోసం విరాళం ఇచ్చిన మొట్టమొదటి హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ.. క్వారంటైన్ టైమ్ లో అమ్మా-నాన్నను బాగా మిస్ అవుతున్నానంటోంది.

లావణ్య త్రిపాఠి తల్లిదండ్రులు డెహ్రాడూల్ లో ఉంటారు. లావణ్య హైదరాబాద్ లో ఉంటోంది. ఈ క్వారంటైన్ లో తనతో పాటు తన చెల్లెలు ఉంటే తనకు బెస్ట్ పార్టనర్ అయ్యేదని చెప్పుకొచ్చింది లావణ్య. ప్రస్తుతం కొన్ని సినిమాలతో పాటు పలు వెబ్ సిరీస్ లు చూసే పనిలో ఈ సొట్టబుగ్గల చిన్నది బిజీగా ఉంది.