నా వయసెంతో చెప్పుకోండి

నిజంగా మహేష్ రిలీజ్ చేసిన ఈ స్టిల్ అలానే ఉంది. ఏళ్లు గడిచేకొద్దీ సూపర్ స్టార్ వయసు తగ్గిపోతోంది. దానికి మరో ఎగ్జాంపుల్ ఈ ఫొటో.

ఈ లాక్ డౌన్ టైమ్ లో ఫ్యామిలీతో ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నాడు మహేష్. దానికి సంబంధించి ఎప్పటికప్పుడు కొత్తకొత్త ఫొటోలు కూడా పెడుతున్నాడు. ఈ క్రమంలో మహేష్ పెట్టిన ఓ పిక్ వైరల్ అవుతోంది. మీసం, గడ్డం తీసేసి కాస్త జుట్టు పెంచి అల్ట్రా మోడ్రన్ గా రెడీ అయ్యాడు మహేష్.

తన కొత్త సినిమా కోసమే మహేష్ ఇలా మేకోవర్ అయ్యాడని ఆయన ఫ్యాన్స్ చెబుతున్నారు. నిజానికి ఈ గెటప్ లో మహేష్ ఫొటో రిలీజ్ చేయడం ఇది ఫస్ట్ టైమ్ కాదు. ఇంతకుముందు ఓ స్టిల్ రిలీజ్ చేశాడు. దానికి కొనసాగింపుగా ఇది వచ్చింది.

కూతురు సితారతో కలిసి మహేష్ దిగిన ఈ సెల్ఫీ నిమిషాల వ్యవథిలో వైరల్ అయింది.

ఫొటోలో మహేష్ మోస్ట్ హ్యాండ్సమ్ గా ఉన్నాడు. అదే గెటప్ తో కొత్త సినిమా చేస్తే కచ్చితంగా మహేష్ కెరీర్ లో ఇదో మంచి మేకోవర్ గా నిలిచిపోతుంది.

మరి.. మహేష్ లాక్ డౌన్ టైమ్ లో సరదాగా ఈ లుక్ ట్రై చేశాడా లేక కొత్త సినిమా కోసం ఇలా ప్రిపేర్ అవుతున్నాడా అనేది వచ్చే నెలలో తేలిపోతుంది.