నాగార్జున ఉపాధి హామీ పథకం

Nagarjuna offers Dia Mirza

ఏ హీరో అయినా తమ సినిమాల్లో కాస్త క్రేజ్ ఉన్న అమ్మాయిని హీరోయిన్ గా పెట్టుకోవాలని అనుకుంటాడు. ఒకవేళ తన ఏజ్, గేజ్ కు సెట్ అవ్వకపోతే పొరుగు రాష్ట్రం నుంచైనా తెచ్చుకోవాలని భావిస్తాడు. కానీ నాగార్జున మాత్రం అచ్చంగా ఉపాధి హామీ పథకాన్ని అమలు చేస్తున్నాడు. ఎవరెవరు ఖాళీగా ఉన్నారో వెదికి మరీ పిలిచి అవకాశాలిస్తున్నాడు.

ప్రస్తుతం వైల్డ్ డాగ్ అనే సినిమా చేస్తున్నాడు నాగార్జున. ఈ సినిమాలో దియా మీర్జాను హీరోయిన్ గా తీసుకున్నాడు. ఈమె ఇప్పటి హీరోయిన్ కాదు. అసలు దియా మరోసారి సినిమాలు చేస్తుందని కూడా ఎవ్వరూ ఊహించలేదు. అలాంటి హీరోయిన్ ను తీసుకొచ్చి తన సినిమాలో పెట్టుకున్నాడు నాగ్.

ఈయనగారి ఉపాధి హామీ పథకం ఇక్కడితో ఆగిపోలేదు. ఇదే సినిమాతో సయామీ ఖేర్ అనే ఔట్ డేటెట్ హీరోయిన్ కు కూడా చోటిచ్చాడు. ఐదేళ్ల కిందటొచ్చిన సాయితేజ్ రేయ్ సినిమాలో ఈమె నటించింది. అప్పట్నుంచి ఇప్పటివరకు కేవలం 3 సినిమాలే చేసింది. అలాంటి అమ్మాయిని తీసుకొచ్చి అవకాశం ఇచ్చాడు.

వైల్డ్ డాగ్ లో అంటే క్యారెక్టర్స్ డిమాండ్ చేస్తున్నాయి కాబట్టి దియా, సయామీని తీసుకున్నాడని అనుకుందాం. మన్మథుడు-2లో రకుల్ ను, దేవదాస్ లో ఆకాంక్ష సింగ్ ను, ఆఫీసర్ లో మైరా సరీన్ ను తీసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది. ఏజ్ పెరిగినా, నాగ్ లుక్స్ కు మంచి హీరోయిన్లు సెట్ అవుతారు. కానీ నాగ్ మాత్రం ఇలా ఔట్ డేటెడ్ హీరోయిన్లతో నెట్టుకొచ్చేస్తున్నాడు. ఇకనైనా హీరోయిన్ల విషయంలో ప్రయోగాలు ఆపేసి, కాస్త ముక్కు-మొహం తెలిసిన ముద్దుగుమ్మల్ని పెట్టుకుంటే బాగుంటుందని అక్కినేని అభిమానులు తెగ ఇదైపోతున్నారు.