నాని సెప్టెంబర్ సెంటిమెంట్

Nani september sentiment

తప్పనిసరి పరిస్థితుల్లో ఆగస్ట్ 30 నుంచి సెప్టెంబర్ 13కు గ్యాంగ్ లీడర్ సినిమాను వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. కానీ నాని మాత్రం ఫీల్ అవ్వలేదు. సాహో కూడా తన సినిమానే అని పైకి చెప్పుకున్నప్పటికీ, మనసులో మాత్రం ఈ హీరోకు ఓ సెంటిమెంట్ అనుకోకుండా కలిసొచ్చింది. అదే సెప్టెంబర్ సెంటిమెంట్

అవును.. సెప్టెంబర్ నెలలో నాని రిలీజ్ చేసిన సినిమాలన్నీ సక్సెస్ అయ్యాయి. తన తొలి సినిమా అష్టాచమ్మా నుంచి రీసెంట్ గా వచ్చిన  దేవదాస్ వరకు అన్నీ క్లిక్ అయ్యాయి. అందుకే గ్యాంగ్ లీడర్ సినిమా సెప్టెంబర్ కు వాయిదా పడిందనేసరికి పెద్దగా ఫీల్ అవ్వలేదు ఈ హీరో. పైగా తనకు ఆ నెల సెంటిమెంట్ అని కూడా చెప్పుకొచ్చాడు. ఇంతకీ నాని నటించిన ఏఏ సినిమాలు సెప్టెంబర్ లో రిలీజ్ అయ్యాయో చూద్దాం

అష్టాచమ్మా – సెప్టెంబర్ 5, 2008
పిల్ల జమీందార్ – సెప్టెంబర్ 29, 2011
భలే భలే మగాడివోయ్ – సెప్టెంబర్ 4, 2015
మజ్ను – సెప్టెంబర్ 23, 2016
దేవదాస్ – సెప్టెంబర్ 27, 2018