‘ప్రభాస్ ను లవ్ చేయడం లేదు’

తను ప్రభాస్ ను లవ్ చేస్తున్నాననే వార్తలో నిజం లేదంటోంది నిహారిక. ప్రభాస్ కు తనకు పెళ్లి అనే వార్తల్లో కూడా ఎలాంటి వాస్తవం లేదంటోంది. క్వారంటైన్ టైమ్ లో వెబ్ మీడియాలో చిట్ చాట్ చేసింది ఈ మెగా డాటర్. వాటిలోంచి టాప్-5 క్వశ్చన్స్ మీకోసం..

మీ బెడ్ సీక్రెట్ ఏంటి?
ఆమధ్య ఓసారి చైనా వెళ్లాం. షాపింగ్ చేశాం. చిన్నప్పుడు అమ్మ లేదా అన్నతో కలిసి పడుకున్నాం. పెళ్లాయ్యక కూడా ఎలాగూ కామన్ బెడ్ ఉంటుంది. ఈ గ్యాప్ లోనైనా నాకంటూ ఓ మంచి బెడ్ కొనుక్కోవాలని అనుకున్నాను. అందుకే చైనాలో ఓ మంచి బెడ్ కొనుక్కున్నాను. ఫ్రీ టైమ్ దొరికితే ఆ బెడ్ మీద వాలిపోతాను.

2. ఎవరికీ చెప్పని సీక్రెట్?
చాలామందికి తెలియని విషయం ఏంటంటే.. నాకు లిప్ స్టిక్స్ అంటే పిచ్చి. నా దగ్గర కనీసం 40 లిప్ స్టిక్స్ ఉంటాయి. రోజుకొక లిప్ స్టిక్ పెట్టుకుంటాను. నాకు మేకప్ అంటే పిచ్చి. ప్రతి రోజూ రెడీ అవుతాను. ఎక్కడికెళ్తున్నావ్ అని మా అమ్మ అడుగుతుంది. లేదు ఇంట్లోనే ఉంటా అని చెబుతాను.

3. పవన్ ఏమని పిలుస్తారు?
చిన్నప్పుడు నేను కొంచెం జపనీస్ పిల్లలా ఉండేదాన్ని. మష్రూమ్ హెయిర్ కట్ తో ఉండేదాన్ని. గుండ్రటి మొహం ఉండేది. దీంతో కల్యాణ్ బాబాయ్ నన్ను నిహా అని పిలచేవారు కాదు, చిన్నప్పుడంతా నన్ను తకాషిమయ అనే జపనీస్ పేరుతోనే పిలిచేవారు. చిన్నప్పుడు కల్యాణ్ బాబాయ్ ఎప్పుడూ నా ఒరిజినల్ పేరుతో పిలవలేదు.

4.తేజ్ బావ, వైష్ణవ్ బావ గురించి?
తేజ్ బావ అంటే నాకు చాలా ఇష్టం. అంత జెన్యూన్ పర్సన్ ను నేను ఎక్కడా చూడలేదు. వైష్ణవ్ బావ కూడా అంతే. వీళ్లిద్దరూ చాలా జెన్యూన్ గా ఉంటారు. సాయితేజ్ తో సినిమా చేయమని చాలామంది అడుగుతున్నాను. వరసకు బావ బావే గానీ అన్నతో క్లోజ్ గా ఉంటాడు కాబట్టి నేను కూడా అన్నలానే చూస్తాను తేజ్ ని.

5. ప్రభాస్ తో ప్రేమ-పెళ్లి లాంటివి?
ప్రభాస్ ను నేను లవ్ చేయడం లేదు. అసలు ఈ రూమర్ ఎలా స్టార్ట్ అయిందో కూడా నాకు తెలీదు.