
కొమరం పులి సినిమాతో పాపులర్ అయింది నికిషా పటేల్. ఆ తర్వాత నటించిన సినిమాలేవీ ఆమెకి గుర్తింపు తీసుకురాలేదు, ఆఫర్లనూ వెంటబెట్టుకు రాలేదు. ఐతే నిత్యం బికినీ ఫోటోలు షేర్ చేస్తూ సోషల్ మీడియాలో సందడి చేస్తూ ఉంటుంది నికిషా. పెద్ద హీరోలందరికీ బర్త్‌డే విషెష్ కూడా క్రమం తప్పకుండా పోస్ట్ చేస్తుంటుంది. ఈ సారి పవన్ కల్యాణ్‌కి బర్త్‌డే విషెష్ చెప్పి అడ్డంగా బుక్ అయింది. హ్యాపీ బర్త్‌డే పవన్ కల్యాణ్ అని చెప్పి పవన్ కల్యాణ్ పేరునో, హ్యపీబర్త్డేపవర్స్టార్ అనో హ్యష్‌ట్యాగ్ పెడితే సరిపోయేది. ఐతే ఆమె అపుడు ట్విట్టర్లో పవన్ కల్యాణ్ పేరు మీద ట్రెండ్ అవుతున్న హ్యాష్ట్యాగ్లన్నింటిని ఏరి తన టైమ్‌లైన్‌లో పెట్టింది.
ఆమె పెట్టిన హ్యష్ట్యాగ్లో పావలాకల్యాణ్ అనే ట్యాగ్ కూడా ఉంది. పవన్ కల్యాణ్‌ని ట్రోల్ చేసేందుకు వైసీపీ నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు క్రియేట్ చేసిన హ్యష్‌ట్యాగ్ అది. అంటే పవన్ కల్యాణ్‌ని కింపచరిచేదది. అలాంటి ట్యాగ్‌ని ఆమె యాడ్ చేసింది. తెలుగు రాకపోవడం వల్ల వచ్చిన సమస్య. ఆ ట్యాగ్ కూడా ట్రెండ్ అవుతోందని..తాను ట్రెండింగ్‌లో ఉందామని అలా ప్లాన్ చేసింది. కానీ అది వికటించింది.
పవర్‌స్టార్ ఫ్యాన్స్ ఆమెపై విరుచుకుపడ్డారు. దెబ్బకి ఆ ట్వీట్‌ని డిలీట్ చేసింది. అంతేకాదు, ఇకపై సోషల్ మీడియాకి దూరంగా ఉంటానని ట్వీట్ చేసింది. కొన్నాళ్లూ సైలెంట్‌గా ఉంటుందట.