చిరంజీవి-కొరటాల మూవీ: ఏది వైరల్.. ఏది రియల్

Chiranjeevi Koratala Siva film

టాలీవుడ్ లో వచ్చే కొన్ని పుకార్లను అస్సలు నమ్మడానికి వీల్లేదు. ఆ క్షణానికి అవి నిజాలుగానే కనిపిస్తాయి. కట్ చేస్తే, కొన్నాళ్లకు అవన్నీ అబద్ధాలని తేలుతాయి. సరిగ్గా ఇలాంటిదే ఓ రూమర్ ఇప్పుడు ఫిలింసర్కిల్స్ లో జోరుగా నడుస్తోంది. అది కూడా అలాంటిలాంటి న్యూస్ కాదు, ఏకంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది అది.

ఇంతకే మేటర్ ఏంటంటే.. చిరంజీవి-కొరటాల కాంబోలో సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే కదా. ఈ సినిమాలో నక్సలిజం బ్యాక్ డ్రాప్ ఉందట. సినిమాలో వచ్చే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో ఈ నక్సలిజం ఎలిమెంట్ ను టచ్ చేశారట. అంతేకాదు.. సినిమాలో చిరంజీవి రెండు షేడ్స్ లో కనిపిస్తాడట. యంగ్ అండ్ ఎనర్జిటిక్ గోవింద్ రోల్ లో ఫ్లాష్ బ్యాక్ లో కనిపిస్తాడట. ఇక మిగతా భాగమంతా ఆచార్య అనే మిడిల్-ఏజ్డ్ పాత్రలో కనిపిస్తాడట.

ప్రస్తుతం టాలీవుడ్ లో జోరుగా నడుస్తున్న పుకారు ఇది. దీనిపై రియాక్ట్ అవ్వడానికి మాత్రం ఎవ్వరూ ఇంట్రెస్ట్ చూపించడం లేదు. కొరటాల ఎప్పట్లానే కామ్ గా ఉన్నాడు. ఇక చిరంజీవి సంగతి సరేసరి. ఈ న్యూస్ లో నిజం ఎంతో తెలియాలంటే వీళ్లిద్దరిలో ఒకరు నోరువిప్పాలి. ఎట్ లీస్ట్ ఈ ప్రాజెక్టు నిర్మాత రామ్ చరణ్ అయినా రియాక్ట్ అవ్వాలి. ఈ మేటర్ పై ఎప్పుడు క్లారిటీ వస్తుందో ఏంటో? అయితే మెగా కాంపౌండ్ కు కాస్త దగ్గరగా ఉండే వ్యక్తులు మాత్రం ఈ పుకారులో సగం నిజం అందని చెబుతున్నారు. ఈ మొత్తం ఎపిసోడ్ లో కొసమెరుపు ఇదే.