మహేష్ బాబు పిల్లలకి స్కూళ్ళు ఉండవా?

మహేష్ బాబు పిల్లలకి స్కూళ్ళు ఉండవా?

సూపర్ స్టార్ మహేష్ బాబుకి టైం దొరికితే చాలు ఫారిన్ హాలిడేస్ కి చెక్కేస్తాడు. ఆయనకి అంత డబ్బు ఉంది మరి. ఒక ఇయర్ లో ఎంత లేదన్న … నాలుగు అయిదు సార్లు టూర్లు వెయ్యాలిసిందే. తనతో పాటు భార్య, పిల్లల్ని కూడా వెంటేసుకెళ్తాడు. లేటెస్ట్ గా మొన్న శనివారం అమెరికా వెళ్ళాడు పిల్లలని తీసుకొని.

అయితే ఇక్కడే అందరికి ఒక డౌట్.

మహేష్ బాబు పిల్లలకి స్కూల్ లేదా అనేది. మండే నుంచి స్కూళ్ళు స్టార్ట్ అయ్యాయి. కానీ ఆయన ఇప్పుడు హాలిడేస్ కి వెళ్ళాడు. మరి స్కూల్లో ఏమి అనరా? సూపర్ స్టార్ పిల్లలు కాబట్టి చూసి చూడనట్లు స్కూల్ మేనేజ్ మెంట్ వదిలేస్తుందా? స్కూల్ హాలిడేస్ తో సంబంధం లేకుండా మహేష్ ఎప్పుడూ ట్రిప్పులు వేస్తుంటాడు. 

అయినా మనలో మాట …వాళ్ళు ర్యాంకులు తెచ్చుకోవాలా ఏంటి? ఎన్ని తరలు తిన్నా తరగని ఆస్తి. గౌతమ్ ఎలాగూ హీరో అవుతాడు. సితార కూడా సినిమా ఇంట్రెస్ట్ ఉంది. రెడీమెడ్ ఫాన్స్ ఉంటారు. సో సమస్యే లేదు కదా.