డియర్ కామ్రేడ్ కి అక్కడ టిక్కెట్లు లేవట

విజయ్ దేవరకొండ, రష్మిక జోడీగా నటించిన చిత్రం ‘డియర్ కామ్రేడ్’ ఈ నెల 26న ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతోంది. భరత్ కమ్మ దర్శకత్వంలో వస్తోన్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్, బిగ్ బెన్ సినిమాస్ సంయుక్తంగా నిర్మించాయి.

ఈ నెల 25వ తేదీన యూఎస్ లో ప్రీమియర్స్ ఏర్పాటు చేసారు. కాగా విజయ్ దేవరకొండకు ఉన్న భారీ డిమాండ్ వాళ్ళ అక్కడి వారికీ టికెట్స్ దొరకని పరిస్థితి ఏర్పడింది. అన్ని థియేటర్స్ లో అడ్వాన్స్ బుకింగ్స్ అన్ని ఫుల్ అయ్యాయట. టికెట్లు దొరకని వారి కోసం సాయంత్రం 6 గంటల నుండి మొదలయ్యే ప్రీమియర్ షోల కంటే ముందే కొన్ని చోట్ల ముందస్తు ప్రీమియర్ షోస్ వేసే ఏర్పాట్లు చేస్తోంది ఒక డిస్ట్రిబ్యూషన్ సంస్థ.

రిలీజ్ కు ముందే ఈ సినిమా మంచి టాక్ సొంతం చేసుకోవటంతో తెలుగు రాష్ట్రాల్లో సైతం సినిమాకు భారీ డిమాండ్ ఉంది.