సీఎంగా పవన్.. స్వీట్ గాసిప్

ఆచార్య అయిపోగానే లూసిఫర్ రీమేక్ ను సెట్స్ పైకి తీసుకురాబోతున్నారు చిరంజీవి. సుజీత్ దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాలో మోహన్ లాల్ పాత్రలో చిరంజీవి కనిపించబోతున్నారు. ఇందులో మరో కీలక పాత్ర కూడా ఉంది. ఆ పాత్రను పవన్ తో చేయించాలనే ఆలోచనలో ఉన్నారట. ప్రస్తుతానికి ఇది గాసిప్పే అయినప్పటికీ వినడానికి ఇంట్రెస్టింగ్ గా ఉంది. అందుకే మీకోసం..

సినిమాలో ముఖ్యమంత్రి పాత్రధారి సచిన్ ఖేడ్కర్ చనిపోతాడు. దీంతో హఠాత్తుగా తెరపైకొస్తాడు అతడి తనయుడు టొవినా థామస్. అప్పటివరకు రాజకీయాలు అంటే ఏంటో తెలియని థామస్ కు ట్రయినింగ్ ఇచ్చి మీడియా ముందుకు వదుల్తాడు మోహన్ లాల్. అతడ్నే ముఖ్యమంత్రిని చేస్తాడు.

ఇప్పుడీ పాత్ర కోసం పవన్ కల్యాణ్ ను అనుకుంటున్నట్టు పుకార్లు వస్తున్నాయి. నిజానికి పైన చెప్పుకున్నది చిన్న లైన్ మాత్రమే. ఈ క్యారెక్టర్ సినిమాలో చాలా బాగుంటుంది. పైగా పవన్ కల్యాణ్ కోసం సుజీత్ ఈ క్యారెక్టర్ ను దాదాపు 15 నిమిషాల పాటు పెంచి మరింత హీరోయిజం యాడ్ చేశాడట.

ప్రస్తుతం సోషల్ మీడియాలో లూసిఫర్ రీమేక్ పై పుకార్లు ఇలా సాగుతున్నాయి. అటు లూసిఫర్ లో పృధ్విరాజ్ పోషించిన పాత్ర కోసం కూడా ఓ హీరో కోసం వెదుకుతున్నారు. దీనిపై కూడా చాలా రూమర్స్ వచ్చాయి. ఆచార్య తర్వాతే వీటన్నింటిపై ఓ క్లారిటీ వస్తుంది.