నడుము చూపిస్తే తప్పు లేదు…. కాళ్ళు చూపిస్తే తప్పా?

నడుము చూపిస్తే తప్పు లేదు.... కాళ్ళు చూపిస్తే తప్పా?

హీరోయిన్ పూజ హెగ్డేకి కోపమొచ్చింది. “హీరోయిన్ల నడుము చూపిస్తే చొంగ కారుస్తారు. బొద్దు మీద పళ్ళు, పూలు వేస్తే.. అబ్బబ్బబ్బా ఏమి గ్లామర్ నెవెర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అన్నాలెవల్లో పరవశం చెందుతారు. కానీ నా కాళ్ళు చూపిస్తే మీకు నొప్పి వచ్చిందా?” – దాదాపుగా ఈ టోన్ లోనే ఫైర్ అయింది పూజ.

“అల వైకుంఠపురంలో” సినిమా రిలీజ్ తర్వాత మినీ కాంట్రవర్సీ వచ్చింది. అదేంటంటే… హీరో ఆమె కాళ్ళని చూస్తూ కామెంట్ చెయ్యడం.. హీరోయిన్ లేడీ బాస్ గా నటించినా డైరెక్టర్ల చూపులు తొడలు, వక్షోజాల పై నుంచి మరలవా …అంటూ ఫెమినిస్టులు విమర్శలు చేశారు. వాటికి రెస్పాండ్ అయింది ఈ బ్యూటీ.

“సామజవరగమన” అనే పాటలోనే అంత వివరణ ఉందని చెప్తోంది. ఇంతకుముందు అనేక సినిమాల్లో హీరోయిన్ల నడుము చుట్టే కెమెరా తిరిగినప్పుడు కామెంట్ చెయ్యలేదు..ఇప్పుడు ఎందుకు ప్రశ్నిస్తున్నారు అని అడుగుతోంది.