ఆయన నా లెగ్స్ చూస్తే తప్పేంటి: పూజ హెగ్డే

పూజ హెగ్డే మంచి అందెగత్తె. అంతేకాదు మంచి మాటకారి. “అల వైకుంఠపురంలో” సినిమాలో హీరో … మొదటిసారి హీరోయిన్ని కలవగానే ఆమె లెగ్స్ చూస్తాడు. షార్ట్ స్కర్ట్ లో ఉన్న పూజా హెగ్డే కాళ్ళపై నుంచి అతని కళ్ళు లేవవు. ఈ సీన్ చాలా ఎబ్బెట్టుగా ఉందని విమర్శకులు రాశారు. అయితే, ఇందులో తప్పేమి లేదని సమర్థిస్తోంది పూజ.

“హీరో పదే పదే నా కాళ్లను చూస్తుంటే, ఒకసారి పైకి చూడమని చెప్తాను. అప్పుడతను నా కాళ్ల మీద నుంచి దృష్టిని మరల్చి నా కళ్లవంక చూస్తాడు. అప్పుడు తన కొలీగ్స్ తో “ఫస్ట్ టైం మేడమ్ కళ్లు చూశాను. మేడమ్ సార్.. మేడమ్ అంతే” అని చెప్పే డైలాగ్ నాకు బాగా నచ్చింది. ఐ థింక్ దట్ ఇట్ వాజ్ జస్టిఫైడ్. లంగా, చోళీలు వేసుకున్నప్పుడు నడుము చూపిస్తుంటారు కదా. అప్పుడు తప్పు అనిపించలేదా?,” అంటూ ఈ అమ్మడు రివర్స్లో మనకే బ్యాండ్ వేస్తోంది.

ఆమెతో మూడోసారి నటించాలనే మూడొస్తుంది అని  బన్నీ అన్న మాటకే ఓటు వేస్తానని కూడా చెప్పింది ఈ సొగసరి. “మేం ఇప్పటి దాకా రెండు సినిమాలు కలిసి చేశాం. దాంతో మామధ్య సెట్స్ పై కంఫర్ట్ లెవల్ పెరిగింది. అది తెరపై కెమిస్ట్రీ రూపంలో కనిపించింది. అందుకే మామధ్య కెమిస్ట్రీ బాగుందని అందరూ అంటున్నారు. అందువల్లే అల్లు అర్జున్ ఆ మాట అన్నారు. ఆయన అన్నట్లుగానే ఇద్దరం కలిసి మరో సినిమా చెయ్యాలని ఆశిస్తున్నా,” అంటూ సమాధానము ఇచ్చింది.