తమన్… అడ్డంగా బుక్ – భగ్గుమన్న రెబల్ స్టార్ ఫ్యాన్స్

Prabhas fans fires on Thaman

మ్యూజిక్ ఇవ్వడంలోనే కాదు, సోషల్ మీడియాలో కూడా కూసింత యాక్టివ్ గా ఉంటాడు తమన్. అయితే ఒక్కోసారి ఆ ఉత్సాహం కాస్తా అత్యుత్సాహంగా మారి ఫ్యాన్స్ తో తిట్లు కూడా తినాల్సి ఉంటుంది. అలా బ్యాక్ టు బ్యాక్ వరుసగా రెండు రోజులు బుక్ అయ్యాడు తమన్. ఓ రీట్వీట్ చేసినందుకు, మరో ట్వీట్ తో ఒకర్ని ప్రస్తావించనందుకు తమన్ కు సోషల్ మీడియాలో తిట్లు పడుతున్నాయి.

సాహో సినిమాపై సోషల్ మీడియాలో రకరకాల కామెంట్స్ పడుతున్నాయి. ఆ టైమ్ లో ఎవరో తమన్ ను ట్యాగ్ చేస్తూ ఓ పోస్ట్ పెట్టారు. సాహో సినిమాలో నువ్వు ఉంటే మూవీ ఓ రేంజ్ లో ఉండేదన్నా అనేది ఆ పోస్ట్. చాప్టర్-1కు మ్యూజిక్ కొట్టించుకొని, సినిమాకు తమన్ ను పక్కనపెట్టడం వల్లనే రిజల్ట్ అలా వచ్చిందనేది సారాంశం. దీనికి తమన్ రీట్వీట్ కొట్టాడు. అంతే ఒక్కసారిగా రెబల్ స్టార్ ఫ్యాన్స్ భగ్గుమన్నారు. తమన్ పై ఓ రేంజ్ లో విరుచుకుపడ్డారు. దీంతో తన రీట్వీట్ ను వెంటనే ఉపసంహరించుకున్నాడు తమన్.