సినిమా చూసి షాకైన ‘ఏడు చేపల కథ’ నిర్మాత

ఏడు చేపల కథ సినిమాకు సంబంధించిన మేటర్ ఇది. రిలీజ్ కు ముందు ఈ యూనిట్ చిన్న ప్రెస్ మీట్ పెట్టింది. ఇందులో హీరోగా నటించిన అభిషేక్ రెడ్డి మాట్లాడాడు. తన సినిమా ఎలా స్టార్ట్ అయింది… అసలు ఇలాంటి అడల్ట్ కంటెంట్ ను నిర్మాత ఎలా ఒప్పుకున్నాడు.. సెన్సార్ కష్టాలేంటి లాంటి విషయాల్ని ఓపెన్ గా చెప్పేశాడు.

“డైరక్టర్ నాకు స్క్రిప్ట్ ఇచ్చాడు. మొత్తం మసాలా తప్ప మరేం లేదు. అందులో కథ నాకు కనిపించలేదు. సరే ఏదో ఒకటి చేద్దామని డిసైడ్ అయ్యాం. తర్వాత ఇద్దరం వెళ్లి నిర్మాతకు కథ చెప్పాం. సింగిల్ సిట్టింగ్ లో నిర్మాత సూపర్ అన్నాడు. అద్భుతమైన లవ్ స్టోరీ అన్నాడు. డబ్బులు పెడతానన్నాడు. మాకు అర్థంకాలేదు. మా సినిమాలో లవ్ లేదు అంతా మసాలానే. అప్పుడు ప్రొడ్యూసర్ భార్య కలుగజేసుకొని అతడికి చెవుడు అనే విషయం చెప్పింది.”

సినిమా 2 షెడ్యూల్స్ అయిన తర్వాత కూడా దేనికైనా మంచిదని నిర్మాతను అడిగామని, అతడు వెనక్కి తగ్గలేదన్నాడు హీరో  అభిషేక్. అయితే ఫస్ట్ కాపీ కూడా చూసుకోకుండా నేరుగా సెన్సార్ సభ్యులతో కలిసి ఈ సినిమా చూసిన నిర్మాత షాక్ అయ్యాడని ఫన్నీగా చెప్పుకొచ్చాడు. మసాలా కావాలనుకునే వాళ్లు ఈ సినిమా తప్పకుండా చూడాలంటున్నాడు. కథ కోసం మాత్రం వెదకొద్దంటున్నాడు.

ఈరోజు థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా సి-సెంటర్లలో హౌజ్ ఫుల్ కలెక్షన్లలో నడుస్తోంది. మరీ ముఖ్యంగా ఆంధ్రాలో ఈ సినిమాను కుర్రాళ్లు ఎగబడి చూస్తున్నారు.