ఆ హీరోయిన్ అనుకుంటే ఈమె ఫిక్సయింది

తను ఏ సినిమా చేసినా అందులో టాలీవుడ్-కోలీవుడ్ కు కామన్ గా తెలిసిన హీరోయిన్ ను పెట్టుకుంటాడు సూర్య. త్వరలోనే హరి దర్శకత్వంలో చేయబోయే సినిమాకు కూడా ఇదే ఫార్ములా ఫాలో అయ్యాడు. కానీ ఒక హీరోయిన్ బదులుగా ఇంకో హీరోయిన్ ను ఫిక్స్ చేసుకున్నారు.

హరి-సూర్య సినిమాలో మొన్నటివరకు పూజా హెగ్డే హీరోయిన్ అనే ప్రచారం జరిగింది. లాక్ డౌన్ కు ముందు ఈ విషయాన్ని పూజా హెగ్డే కూడా పరోక్షంగా కన్ ఫర్మ్ చేసింది. అయితే అంతలోనే లాక్ డౌన్ రావడం షూటింగ్స్ నిలిచిపోవడం జరిగాయి. దీంతో లాక్ డౌన్ తర్వాత సూర్య సినిమాకు కాల్షీట్లు ఎడ్జెట్ చేయడం పూజాకు కష్టం అవుతోంది. అందుకే ఈ ప్రాజెక్ట్ నుంచి ఆమె తప్పుకుంది.

నిజానికి సూర్య-హరి ప్రాజెక్ట్ నుంచి పూజా తప్పుకుందనే విషయం ఎవ్వరికీ తెలియదు. మొన్నటికిమొన్న ఓ లైవ్ ఛాట్ లో తను సూర్య సినిమాలో నటించబోతున్నాననంటూ రాశిఖన్నా ప్రకటించడంతో అసలు విషయం బయటకొచ్చింది. అలా ఫస్ట్ టైమ్ సూర్య సరసన నటించే ఛాన్స్ కొట్టేసింది రాశిఖన్నా.