పునర్నవితో ఎఫైర్ పై రాహుల్ రియాక్షన్

బిగ్ బాస్ హౌజ్ లో రాహుల్, పునర్నవి మధ్య అచ్చికబుచ్చికలు అందరూ చూశారు. వాళ్ల మధ్య ఏదో జరుగుతోందంటూ చాలా పుకార్లు వినిపించాయి. అర్థరాత్రి దాటినా, కంటెస్టెంట్లు అంతా పడుకున్నప్పటికీ వీళ్లు మాత్రం వాళ్ల మంచాలపై దుప్పట్లు కప్పుకొని ఒకటే కబుర్లు. అలా కొద్దిరోజుల్లోనే బాగా క్లోజ్ అయిపోయారు వీళ్లిద్దరు. అయితే హౌజ్ నుంచి బయటకొచ్చిన తర్వాత రాహుల్ పై తన ఉద్దేశాన్ని పునర్నవి బయటపెట్టింది. ఇప్పుడు రాహుల్ కూడా తన మనసులో మాట బయటపెట్టాడు.

పునర్నవి, తను బెస్ట్ ఫ్రెండ్స్ మాత్రమే అంటున్నాడు రాహుల్. ఈరోజు సోషల్ మీడియాలో లైవ్ లోకి వచ్చిన రాహుల్.. తనకు, పున్నూకు మధ్య రొమాంటిక్ రిలేషన్ షిప్ లేదని స్పష్టంచేశాడు. అంతేకాదు.. అందరి అనుమానాల్ని తీరుస్తూ, త్వరలోనే తామిద్దరం లైవ్ లోకి వస్తామని కూడా స్పష్టంచేశాడు.

ఈ సందర్భంగా పునర్నవికి సంబంధించి మరో సీక్రెట్ బయటపెట్టాడు రాహుల్. నిజానికి హౌజ్ లోకి వచ్చేటప్పటికీ పునర్నవి మనసులో ఎవరో ఉన్నారట. హౌజ్ లోనే తనకు ఆ మేటరు చెప్పేసిందని, అందుకే తను డేట్ కు పిలిచినా రాలేదని రాహుల్ కుండబద్ధలుకొట్టాడు. అటు పునర్నవి కూడా రాహుల్ తనకు బెస్ట్ ఫ్రెండ్ మాత్రమేనని, బయటకొచ్చిన తర్వాత తనకు ఐ లవ్ యు చెబితే కొడతానని కూడా ఇప్పటికే ప్రకటించింది.