మహేష్ హీరోగా రాజమౌళి సినిమా

ఒక సినిమా సెట్స్ పై ఉంటుండగా మరో సినిమా గురించి ఆలోచించడు రాజమౌళి. కెరీర్ స్టార్టింగ్ నుంచి ఇదే పద్ధతి ఫాలో అయ్యాడు. కానీ ఈసారి మాత్రం అందుకు భిన్నంగా వెళ్తున్నాడు. ఓవైపు ఆర్ఆర్ఆర్ పనులు సాగుతుండగానే మరోవైపు కొత్త సినిమా ఎనౌన్స్ చేశాడు. మహేష్ బాబు హీరోగా సినిమా ప్లాన్ చేస్తున్నాడు జక్కన్న.

నిజానికి ఈ ప్రాజెక్టు కొత్తదేం కాదు. దాదాపు ఏడేళ్లుగా నలుగుతున్నదే. ఇన్నాళ్లకు కార్యరూపం దాల్చుతోంది. ఈ లాక్ డౌన్ టైమ్ లో మహేష్ మూవీ కథాచర్చలు ప్రారంభించాడు రాజమౌళి. ఇంట్లో రాజమౌళి, ఆఫీస్ లో ఆయన తండ్రి విజయేంద్రప్రసాద్ ఉంటున్నారు. వీళ్లిద్దరూ ఆన్ లైన్ వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా కథాచర్చలు ప్రారంభించారు.

దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై నారాయణ నిర్మాతగా ఈ సినిమా రాబోతోంది. ఇటు నారాయణ, అటు డీవీవీ దానయ్య చాన్నాళ్ల కిందటే రాజమౌళికి అడ్వాన్సులు ఇచ్చారు. బాహుబలి-2 తర్వాత వీళ్లిద్దరికి సినిమాలు చేయాలని రాజమౌళి నిర్ణయించాడు. చెప్పినట్టుగానే దానయ్యతో ఆర్ఆర్ఆర్ చేస్తున్నాడు. దీని తర్వాత మహేష్ బాబు సినిమా చేస్తాడు.