నరేష్‌కి చుక్కలు చూపిస్తోన్న రాజశేఖర్‌

Rajasekhar Vs Naresh in MAA

నిజమైన రాజకీయాలు చూడాలంటే సినిమా ఇండస్ట్రీలోనే చూడాలి. మరీ ముఖ్యంగా మూవీ ఆర్టిస్ట్‌ల అసోషియేషన్‌ (మా)లో ఉన్నన్ని రాజకీయాలు ఇంకెక్కడా ఉండవు. ఇంతకుముందు శివాజీరాజీ అండ్‌ గ్యాంగ్‌కి నిద్రపట్టకుండా చేశాడు మాజీ హీరో నరేష్‌. అనేక ఆరోపణలు చేసి, శివాజీరాజాకి మూడు చెరువుల నీళ్లు తాగించాడు. మొన్న జరిగిన ఎన్నికల్లో వారిని ఓడించి నరేష్‌ గ్యాంగ్‌ మాలో హవా మొదలుపెట్టింది.  నరేష్ అధ్యక్షుడిగా, రాజశేఖర్ ఎగ్జిక్యూటివ్ ఉపాధ్యక్షుడిగా ఎన్నికయ్యారు మొన్నటి ఎన్నికల్లో.

మూడు నెలల్లోనే లుకలుకలు మొదలయ్యాయి. అంతర్గత కుమ్ములాటలు ప్రారంభం. శివాజీరాజాకి నరేష్‌ ఎలా చుక్కలు చూపించాడో ఇపుడు నరేష్‌కి మొగుడిలా మారాడాట రాజశేఖర్‌. నరేష్‌ పనికిరాడని అనేశాడు రాజశేఖర్‌. దేనికి పనికి రాడనుకుంటున్నారు అని అడిగితే… అధ్యక్ష పదవికే కాదు దేనికి సూట్‌ అవడని యాంగ్రీమేన్‌ మరీ యాంగ్రీగా సమాధానం ఇచ్చాడు. ఇద్దరి మధ్య విబేధాలు ఆ స్థాయికి చేరాయి.

నరేష్‌కి వ్యతిరేకంగా నిన్న మిడ్‌నైట్‌ మసాలా మీటింగ్‌ జరిగింది. ఆ వార్త బయటికి పొక్కడంతో నరేష్‌ అలెర్ట్‌ దిద్దుబాటు చర్యలు మొదలుపెట్టాడు. అప్పటికపుడు ఒక ప్రెస్‌నోట్‌ విడుదల చేయించాడు.  “ఓ అసోసియేష‌న్ అంటే.. చాలా స‌మ‌స్య‌లుంటాయి. వాటన్నింటినీపై అంద‌రూ చ‌ర్చించి నిర్ణ‌యం తీసుకోవాల్సి ఉంటుంది. `మా` వెల్ఫేర్‌కి సంబంధించి అత్య‌వ‌స‌రంగా తీసుకోవాల్సిన చ‌ర్య‌లు గురించి మంగ‌ళ‌వారం ఎగ్జిక్యూటివ్ మీటింగ్ జ‌రిగింది. మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్‌కు సంబంధించి మీడియాకు తెలియ‌జేయాల్సిన వార్త‌లేవైనా ఉంటే అధికారికంగా మేమే తెలియ‌జేస్తాం“అంటూ మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్ కార్య‌వ‌ర్గం తెలియ‌జేసింది.

ఇప్పటికపుడు మేటర్‌ చల్లారచ్చు. కానీ రాజశేఖర్‌ రాను రాను… నరేష్‌కి ఓ రేంజ్‌లో డెంట్‌ పెడుతాడనేది కన్‌ఫమ్‌. శివాజీరాజా హాయిగా నవ్వుకుంటున్నాడు.