రెండో ఇల్లు సెట్ చేసిన రకుల్

Rakul Preet new house

పెట్టుబడులన్నీ జిమ్ లు, ఇల్లుపైనే పెడుతోంది రకుల్ ప్రీత్ సింగ్. ఇప్పటికే తన ఆదాయంలో చాలా భాగాన్ని హైటెక్ జిమ్స్ ఏర్పాటుచేయడానికి వెచ్చించిన ఈ బ్యూటీ.. ఆ తర్వాత ప్రాధాన్యత ఇళ్లకు ఇస్తోంది. ఆమెకు హైదరాబాద్ లో ఇప్పటికే ఓ ఇల్లు ఉంది. ఇప్పుడు మరో ఇల్లు కూడా సెట్ చేసుకుంది. అది బెంగళూరులో.

అవును.. తాజాగా బెంగళూరులో మరో ఇల్లు కొనుగోలు చేసింది ఈ ఫిట్ నెస్ ఫ్రీక్. నగరంలోని ఖరీదైన ప్రాంతంలో సకల సౌకర్యాలతో ఇల్లు పట్టేసింది. అయితే అంతకంటే ముందు మరో పని చేసింది ఈ బ్యూటీ. బెంగళూరులో కొత్తగా ఓ ఫిట్ నెస్ సెంటర్ ఏర్పాటుచేసింది. అలా ఫిట్ నెస్ సెంటర్ ఏర్పాటుచేయడం, ఇలా ఇల్లు కొనడం అన్నీ చకచకా జరిగిపోయాయి. చేతిలో డబ్బు ఉంటే ఇలాంటి పనులు చిటికెలో అయిపోతాయి.

మొత్తానికి ఇన్నాళ్లూ తను సంపాదించిన డబ్బును రకుల్ బాగానే పెట్టుబడులుగా పెట్టింది. భవిష్యత్తులో సినిమా అవకాశాలు తగ్గినా.. తన ఆదాయానికి ఎలాంటి ఢోకా లేకుండా బాగానే ప్లాన్ చేసుకుంది రకుల్.