ఎట్టకేలకు కెమెరా ముందుకొచ్చిన రానా

ఎట్టకేలకు కెమెరా ముందుకొచ్చిన రానా

అదిగో రానా, ఎట్టకేలకు మన ముందుకొచ్చాడు. రామానాయుడు స్టుడియోస్ లో జరిగిన గల్లా అశోక్ సినిమా ఓపెనింగ్ లో ప్రత్యక్షమయ్యాడు. కాస్త సన్నగా మారినప్పటికీ ఫిట్ గానే ఉన్నట్టు కనిపించాడు ఈ దగ్గుబాటి హీరో.

కొన్నాళ్లుగా రానా సినిమాలకు దూరమైన సంగతి తెలిసిందే. కిడ్నీ సమస్యతో అతడు బాధపడ్డాడు. దీనికి సంబంధించి కాలిఫోర్నియాలో రానాకు సర్జరీ కూడా జరిగింది. చాన్నాళ్ల పాటు అక్కడే ఉన్నాడు. ఇండియా వస్తాడని అనుకున్నప్పటికీ వైద్యుల సూచనలే మేరకు కాలిఫోర్నియాలోనే చాన్నాళ్లు ఉండిపోయాడు. ఆ తర్వాత ఇండియాకొచ్చినా హైదరాబాద్ రాలేదు. కొన్ని రోజులు ముంబయిలో ఉన్నాడు.

అలా పూర్తిగా ముఖం చాటేసిన రానా ఎట్టకేలకు ఓ ఫంక్షన్ కు హాజరయ్యాడు. సర్జరీ తర్వాత రానా పబ్లిక్ ఎప్పీయరెన్స్ ఇచ్చిన ఈవెంట్ ఇదే. దీంతో చాలామంది ప్రముఖులు ఓవైపు ప్రారంభోత్సవాన్ని ఎంజాయ్ చేస్తూనే, మరోవైపు రానా యోగక్షేమాలు అడగడం కనిపించింది.

ప్రస్తుతం రానా పూర్తిగా కోలుసుకున్నాడు. త్వరలోనే విరాటపర్వం సెట్స్ పైకి రాబోతున్నాడు. ఆ సినిమా కంప్లీట్ అయిన వెంటనే గుణశేఖర్ దర్శకత్వంలో హిరణ్యకశిప సినిమా స్టార్ట్ చేస్తాడు. రానా నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో గుణశేఖర్ తన సినిమా ప్రీ-ప్రొడక్షన్ పనుల్లో వేగం పెంచాడు. అసిస్టెంట్ డైరక్టర్స్ కావాలంటూ రీసెంట్ గా పిలుపు కూడా ఇచ్చాడు.