క్వారంటైన్ లో వార్షికోత్సవం చేసిన నటుడు

ప్రజలంతా దాదాపు నెల రోజులుగా లాక్ డౌన్ లో ఉన్నారు. అంతా ఇళ్లకే పరిమితమైపోయి సెల్ఫ్ క్వారంటీన్ లో ఉన్నారు. అయితే రవిబాబు మాత్రం ఏకంగా తన క్వారంటీన్ కు ఏడాది పూర్తయిందని ప్రకటించుకున్నాడు. ఈ మేరకు క్వారంటీన్ యానివర్సరీని కూడా ఏడుస్తూ సెలబ్రేట్ చేసుకున్నాడు.

రవిబాబు గుక్కపెట్టి ఏడుస్తుంటాడు. ఏం జరిగిందో చూడ్డానికి తండ్రి చలపతిరావు వస్తాడు. అలా ఏడుస్తూనే క్యాండిల్ ఊదేసి కేక్ తింటాడు. తండ్రికి కూడా తినిపించబోతాడు. ఖర్మరా బాబు అంటూ చలపతిరావు అక్కడ్నుంచి వెళ్లిపోతాడు.

ఏడుస్తూ రవిబాబే మొత్తం కేక్ తినేస్తాడు. గమ్మత్తేంటంటే.. ఆ కేక్ ను కూడా కరోనా వైరస్ షేపులో తయారుచేశాడు రవిబాబు. గతేడాది తీసిన ఆవిరి సినిమా తర్వాత మళ్లీ మరో సినిమా ఎనౌన్స్ చేయలేదు రవిబాబు. అలా దాదాపు ఏడాదిగా ఆయన ఖాళీగా ఉన్నాడు.