సాహో దర్శకుడి సంచలన వ్యాఖ్యలు

సాహో దర్శకుడి సంచలన వ్యాఖ్యలు

సాహో సినిమాపై వస్తున్న విమర్శలపై తనదైన శైలిలో స్పందించాడు దర్శకుడు సుజీత్. సాహోలో ఏదైనా అర్థంకాకపోతే మరోసారి చూడాలంటున్న ఈ దర్శకుడు.. క్రిటిక్స్ కాస్త సంయమనం పాటించి ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డాడు. రివ్యూలు పోస్ట్ చేసే ముందు ఇంకాస్త వేచి చూస్తే బాగుండేదని, ఆక్యుపెన్సీని అది ప్రభావితం చేస్తుందని అంగీకరించాడు. ఈ సందర్భంగా మరో ఆసక్తికర స్టేట్ మెంట్ ఇచ్చాడు.

సాహో సినిమా నార్త్ లో బ్రహ్మాండంగా ఆడుతోందని తెలిపిన సుజీత్.. బీహార్ నుంచి తనకు చాలామంది కాల్స్ చేస్తున్నారని తెలిపాడు. అంతేకాదు.. బీహార్ లో పుట్టి ఉంటే సాహో సినిమా తీసినందుకు సుజీత్ కు వాళ్లు గుడికట్టి ఉండేవారట. ఈ విషయాన్ని కూడా ఆ దర్శకుడే చెప్పుకున్నాడు. నార్త్ ప్రేక్షకులకు ఉన్నంత టేస్ట్ సౌత్ ప్రేక్షకులకు లేదని సుజీత్ పరోక్షంగా చెప్పినట్టయింది.

మరోవైపు కాపీ అంటూ వస్తున్న కామెంట్స్ పై కూడా సుజీత్ స్పందించాడు. తను ఇంతవరకు లార్గో వించ్ సినిమా చూడలేదని, తను సొంతంగా సాహో కథ రాసుకున్నానని అంటున్నాడు. తన అప్ కమింగ్ మూవీపై స్పందించిన సుజీత్, ఓ 6 నెలల పాటు రెస్ట్ తీసుకుంటానని, ఆ తర్వాతే కొత్త సినిమా గురించి ఆలోచిస్తానని ప్రకటించాడు.