సాహో.. మరో 2.0గా మారుతోందా?

Saaho turns another 2 point 0

శంకర్‌ తీసిన 2.0 సినిమాకి పెట్టిన బడ్జెట్‌ ఎంత? వచ్చిన ఎమౌంట్‌ ఎంత? పబ్లిసిటీ కోసం ఆ సినిమా బడ్జెట్‌ 500 కోట్లు అని చెప్పుకున్నాడు దర్శకుడు శంకర్‌. అందులో నిజమెంత అన్నది వాళ్లకే తెలియాలి. విడుదలైన తర్వాత సినిమాకి వల్డ్‌వైడ్‌గా 300 కోట్ల రూపాయల షేర్‌ కూడా రాలేదు. వచ్చిన మొత్తంలో కూడా చాలా సమస్యలున్నాయి.  నిర్మించిన ప్రొడ్యుసర్ల ఖాతాలో పెద్ద హోల్‌ పెట్టింది.  2.0 ఇచ్చిన చేదు అనుభవంతో నిర్మాతలు మేల్కొని శంకర్‌ కొత్త సినిమా భారతీయుడు 2ని కొద్ది నెలల పాటు ఆపారు. శంకర్‌ చెప్పిన బడ్జెట్‌లో తీస్తానని బాండ్‌ పేపర్‌ మీద అగ్రిమెంట్‌ చేస్తేనే… సినిమా తీస్తామని నిర్మాతలు భీష్మించుకొని కూర్చోవడంతో సినిమా 8 నెలల పాటు ఆగింది. 

అది 2.0 ఇచ్చిన షాక్‌…

కట్‌ చేస్తే ఇపుడు సాహో విషయంలోనూ అదే సీన్‌ రిపీట్‌ అవుతోంది. ప్రభాస్‌ హీరోగా యూవీ క్రియేషన్స్‌ భారీగా ఖర్చు పెట్టి తీసింది. కానీ పెట్టిన బడ్జెట్‌కి 100 కోట్లు అదనంగా జత చేసి గొప్పలు పోతోందనే కామెంట్‌ వినిపిస్తోంది. దానికి తగ్గట్లుగానే సినిమాని దాదాపు 400 కోట్ల వరకు అన్ని ఏరియాలకి అమ్మారు. సినిమాకి మంచి టాక్‌ వస్తే 400 కోట్ల వసూళ్లు పెద్ద విషయం కాదు. మిక్స్‌డ్‌ టాక్‌ వచ్చినా… బ్యాడ్‌గా వచ్చినా… షేవింగే నిర్మాతలకి. 

అందుకే ఈ హైప్‌ అంత మంచిది కాదంటున్నారు ట్రేడ్‌ పండితులు. ఇప్పటి వరకు నిర్మాతలకి ఏ డిస్ట్రిబ్యూటర్‌ నుంచి అవుట్‌రై్‌ట్‌ ఆఫర్‌ రాలేదు. అడ్వాన్స్‌ల రూపంలోనే రైట్స్‌ ఇచ్చారు. అంటే ఇచ్చిన అడ్వాన్స్‌ కన్నా ఎంత తక్కువ వసూళ్లు వచ్చినా… ఆ మొత్తం తిరిగి నిర్మాతలు బయ్యర్లకివ్వాలి.