సమంతకు నా ట్రయిలర్ నచ్చలేదు: నాగ్

Nagarjuna Manmadhudu 2

మన్మథుడు-2 ప్రచారంలో భాగంగా సినిమాతో పాటు తన లైఫ్ కు సంబంధించిన ఎన్నో డీటెయిల్స్ ను షేర్ చేసుకుంటున్నాడు నాగ్. ఇందులో భాగంగా మూవీకి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ మేటర్ బయటపెట్టాడు. మన్మథుడు-2 ట్రయిలర్ సమంతకు నచ్చలేదంటున్నాడు నాగ్.

“సమంతకు ట్రయిలర్ చూపించాం. ఫస్ట్ చూసిన వెంటనే తనకు నచ్చలేదు. నా మామను నేను ఇలా చూడలేను అంది. కొద్దిసేపు ఏదేదో గొణిగింది. నేను నీ మామ అనే విషయాన్ని మరిచిపోయి, మరోసారి ట్రయిలర్ చూడమని చెప్పాను. మరోసారి ట్రయిలర్ చూసింది. బాగుంది మామ అంది.”

సినిమాలో సమంత కూడా ఓ పాత్ర పోషించింది. చిన్నదే అయినప్పటికీ అది మంచి క్యారెక్టర్ అంటున్నాడు నాగ్. ఇక తన క్యారెక్టర్ గురించి మాట్లాడుతూ.. సినిమాలో తను సెంట్లు తయారుచేసే పాత్ర పోషించినట్టు వివరించాడు. 

“నేను పెర్ఫ్యూమిస్ట్. అంటే పెర్ఫ్యూమ్స్ తయారుచేస్తుంటాను. వాసన చూసి చెప్పే జాబ్ కాదు. డైరక్ట్ గా సెంట్ తయారుచేస్తుంటాను. మరీ ముఖ్యంగా అమ్మాయిల పెర్ఫ్యూమ్స్ తయారుచేయడంలో నేను స్పెషలిస్ట్. వెన్నెల కిషోర్ నా అసిస్టెంట్. మా ఇద్దరి మధ్య టామ్ అండ్ జెర్రీ టైపు ట్రాక్ నడుస్తోంది.”

సినిమాకు సంబంధించి మరో మేటర్ కూడా బయటపెట్టాడు నాగ్. మన్మథుడు-2 సినిమాలో తన కాస్ట్యూమ్స్ ట్రెండ్ క్రియేట్ చేస్తాయని అంటున్నాడు. తనతో పాటు నటీనటులందరికీ అనిరుధ్, దీపిక దుస్తులు డిజైన్ చేశారని.. రిలీజ్ తర్వాత దుస్తులు గురించి ప్రేక్షకులు ప్రత్యేకంగా మాట్లాడుకుంటారని అంటున్నాడు. ఇక సినిమా మొత్తం మీద ఎరుపు రంగు కనిపించదని, ఒకే ఒక్క సీన్ లో మాత్రం రెడ్ కలర్ ఉంటుందని అంటున్నాడు.