నమ్మించి మోసం చేసిన బిగ్ బాస్

Sree Mukhi feels BiggBoss Cheated

ఒక్క రోజు కూడా గ్యాప్ ఉండదు. పొద్దున్నుంచి రాత్రి వరకు ఏదో ఒక షూటింగ్. వద్దంటే లక్షల్లో డబ్బులిచ్చే ఛానెళ్లు-నిర్మాతలు. మరోవైపు వేల సంఖ్యలో అభిమానులు. ఇంతమందిని వద్దనుకొని బిగ్ బాస్ హౌజ్ లోకి వెళ్లింది శ్రీముఖి. ఆమె హౌజ్ లోకి వెళ్లినప్పుడే చాలామంది ఆశ్చర్యపోయారు. వంద రోజుల పాటు ఇన్ని షూటింగ్స్, క్రేజ్, డబ్బు వదిలేసి ఆమె వెళ్లడం బాగాలేదని విమర్శించారు కూడా. కానీ శ్రీముఖి ప్లానింగ్ వేరు.

శ్రీముఖికి కావాల్సింది డబ్బు కాదు. అప్పటికే ఉన్న ఇమేజ్ ను డబుల్ చేసుకోవాలంటే బిగ్ బాస్ లో విజేతగా నిలవాలి. కేవలం ఆ ఒప్పందం మీదనే బిగ్ బాస్ హౌజ్ లో అడుగుపెట్టింది శ్రీముఖి. దీనికి సంబంధించి అప్పట్లో విడుదలైన ఓ ఆడియో టేప్ కూడా కలకలం రేపిన సంగతి తెలిసిందే. అంతా అనుకున్నట్టే శ్రీముఖి ఫైనల్స్ వరకు వెళ్లింది. కానీ ఫైనల్ లో ఓడిపోయింది. రాహుల్ కు కప్పు, డబ్బు రెండూ అప్పగించేసింది.

నవ్వుతూ బయటకొచ్చిన శ్రీముఖి, ఇంటికెళ్లి ఒకటే ఏడుపు. దీనికి కారణం అందరికీ తెలిసిందే. కేవలం విన్నర్ గా నిలవడం కోసమే వెళ్లిన శ్రీముఖిని హౌజ్ లోకి అడుగుపెట్టిన తర్వాత స్టార్ మా నిర్వహకులు పట్టించుకోలేదు. మరీ ముఖ్యంగా ఎవరైనా తనకు వ్యక్తిగతంగా హామీ ఇచ్చారో వాళ్లంతా హ్యాండ్ ఇచ్చారు. దీనికితోడు టైటిల్ వచ్చేలా చూస్తామని చెప్పి, రోజువారీ ఇచ్చే రెమ్యూనరేషన్ కూడా తగ్గించారట. అలా రెంటికి చెడ్డ రేవడిలా తయారైంది శ్రీముఖి పరిస్థితి.

ప్రస్తుతంం హౌజ్ నుంచి బయటకొచ్చిన ఈ బొద్దుగుమ్మ, తన ఫ్రెండ్ సర్కిల్ లో ఇదే విషయం చెప్పి బాధపడుతోంది. టీవీ ఛానెల్ లో కొంతమంది నమ్మించి తనను మోసం చేశారని బాధపడుతోంది. తనను ఇంటర్వ్యూ చేయడానికి ప్రయత్నించిన కొన్ని వెబ్ ఛానెల్స్  ను కూడా తిరస్కరించింది. మళ్లీ ఈమె ఎప్పుడు ట్రాక్ లోకి వస్తుందో చూడాలి.