సైరా… సాంగ్ షూట్ చేసి మరీ తీసేసిన చిరంజీవి

Sye Raa song removed

చిరంజీవి అంటే సాంగ్స్. చిరంజీవి అంటే స్టెప్స్. రీఎంట్రీ మూవీలో కూడా పాటలు, స్టెప్పులతో అదరగొట్టారు మెగాస్టార్. అలాంటి చిరంజీవి సినిమా నుంచి ఏకంగా ఓ సాంగ్ ను లేపేశారు. అది కూడా షూట్ చేసి మరీ తీసేశారు. కేవలం కథ, స్క్రీన్ ప్లేను చెడగొట్టకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నారు. అదే సైరా సినిమా.

అవును.. సైరా సినిమాలో కేవలం 2 పాటలు మాత్రమే ఉంటాయి. మూడో పాట పెట్టాలనుకొని షూటింగ్ కూడా చేశారు. కానీ ఎడిటింగ్ లో ఆ మూడో సాంగ్ ను తీసేశారు. ఈ విషయాన్ని స్వయంగా దర్శకుడు సురేందర్ రెడ్డి వెల్లడించాడు. సైరా ప్రమోషన్స్ లో భాగంగా ఇంటర్వ్యూ ఇచ్చిన సురేందర్ రెడ్డి.. కేవలం స్క్రీన్ ప్లే దెబ్బతింటుందనే కారణంతోనే 2 పాటలకే పరిమితమయ్యామని స్పష్టంచేశాడు. మూడో పాట తీసేయాలనే నిర్ణయం కూడా చిరంజీవిదే అని తెలిపాడు.

మరోవైపు పవన్ కల్యాణ్ వాయిస్ఓవర్ పై కూడా రియాక్ట్ అయ్యాడు సురేందర్ రెడ్డి. తమిళ, మలయాళ, కన్నడ వెర్షన్లకు వాయిస్ ఓవర్ ఎవరితో చెప్పించాలనే అంశంపై డిస్కషన్ జరిగిందని.. తెలుగు వెర్షన్ కు వచ్చేసరికి మాత్రం కేవలం పవన్ తోనే చెప్పించాలని నిర్ణయించామని, అది కూడా చిరంజీవి తీసుకున్న నిర్ణయమని తెలిపాడు. పవన్ లాంటి పొటెన్షియల్ ఉన్న వ్యక్తి చెబితేనే ఆ వాయిస్ రక్తికడుతుందని, సినిమాలో పవన్ వాయిస్ ఓవర్ స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తుందని అంటున్నాడు.