బిగ్ బాస్ లోకి మరో ఇద్దరు భామల ఎంట్రీ ?

Shraddha Das, Hebah Patel

గత ఆదివారం 15 మంది ఇంటి సభ్యులతో అనేక వివాదాల నడుమ ప్రారంభమైన బిగ్ బాస్ రియాల్టీ షో 5 రోజులను పూర్తి చేసుకుంది. అక్కినేని నాగార్జున సారథ్యం వహిస్తున్నారు. సినీ ఇండస్ట్రీ, టీవీ, యూట్యూబ్ తారలున్న 15 మంది ఇంటి సభ్యుల్లో 8 మంది మహిళలు, ఏడుగురు పురుషులు ఉన్నారు. కాగా ఈ వారాంతంలో వైల్డ్ కార్డు ద్వారా మరో ఇద్దరు భామలు బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ ఇవ్వనున్నట్టు తెలిసింది.

వీరిలో ఒకరు ‘కుమారి 21 ఎఫ్’తో కుర్రకారు మనసుదోచుకున్న హెబ్బా పటేల్ కాగా, మరో హాట్ భామ శ్రద్దాదాస్ కు అవకాశం దక్కనుందని వార్తలు వస్తున్నాయి.

గడిచిన 5 రోజుల షోలో హేమ – హిమజ, మహేష్ విట్ట – వరుణ్ సందేశ్ ల పెద్ద యుద్ధాలే జరిగాయి. అయితే ఈ వారం షో నుండి ఎవరిని బయటకు పంపిస్తారో చూడాలి. ఒకరిని షో నుండి ఎలిమినేషన్ తర్వాతే శ్రద్ధ దాస్ గాని, హెబ్బా పటేల్ గాని హౌస్లోకి ప్రవేశించే ఛాన్స్ ఉంది.