నాగార్జునను చూసి భయపడిన వెంకటేష్

Venkatesh fears Nagarjuna

వెంకీ మామ సెట్స్ పై ఉంటుండగానే మరో సినిమాకు ఓకే చెప్పాడు వెంకటేశ్. ఇతడేంటి ఇంత ఫాస్ట్ గా మరో మూవీకి ఓకే చెప్పడమేంటని అంతా అనుకున్నారు. అంతలోనే ఆ సినిమాను పక్కనపెట్టాడు వెంకీ. దానికి కారణం నాగార్జున అయితే, ఆ సినిమా పేరు దేదే ప్యార్ దే రీమేక్.

అవును.. హిందీలో సూపర్ హిట్ అయిన దేదే ప్యార్ దే సినిమాను తెలుగులో రీమేక్ చేయాలనుకున్నాడు వెంకటేశ్. కానీ నాగార్జున నటించిన మన్మథుడు-2 రిజల్ట్ చూసిన తర్వాత వెంకీ మనసు మారిపోయింది. దేదే ప్యార్ దే రీమేక్ ను పట్టాలకి తీసుకురాకూడదని నిర్ణయించుకున్నాడు.

మన్మథుడు-2లో వయసుమళ్లిన మన్మధుడు పాత్ర పోషించాడు నాగ్. ఇటు దేదే ప్యార్ దే సినిమాలో హీరోది 50 ఏళ్ల వ్యాపారవేత్త పాత్ర. రెండు సినిమాల్లో ఇద్దరూ ప్రేమలో పడతారు. ఆశ్చర్యకరంగా రెండు సినిమాల్లో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్. అయితే మన్మథుడు-2 సినిమా డిజాస్టర్ అయింది. దీంతో వెంకీ తను చేయాలనుకున్న రీమేక్ నుంచి తప్పుకున్నాడు.

నిజానికి ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు లాంటి సినిమా చేయాలని వెంకీకి ఎప్పట్నుంచో ఉంది. దేదే ప్యార్ దే లో ఆ ఛాయలు కాస్త ఉన్నాయి. చిన్నచిన్న మార్పులతో అప్పటి సినిమాను గుర్తుకుతెచ్చేలా కొన్ని ఫన్నీ సీన్స్ రాసుకోవచ్చు. వెంకీని ఎట్రాక్ట్ చేసిన ఎలిమెంట్ ఇదే. కానీ మన్మథుడు-2 రిజల్ట్ చూసిన తర్వాత వెంకీ భయటపడ్డాడు. మొత్తానికే సినిమాను పక్కనపెట్టాడు