
సాహో అమెరికాలో సాదాసీదా కలెక్షన్లను పొందుతోంది. ఇప్పటి వరకు ఈ సినిమాకి 2.6 మిలియన్ డాలర్ల వసూళ్లు వచ్చాయి. మంగళవారం ఆఫర్‌తో మరో మూడు లక్షల డాలర్ల వరకు జతపడొచ్చు. ఫైనల్‌గా 3 మిలియన్ డాలర్ల వసూళ్ల మార్క్‌ని దాటుతుందనేది అంచనా. ఆ తర్వాత ఎంత వరకు బండి లాగగలదా?
ప్రస్తుత ట్రెండ్ ప్రకారం ఈ సినిమా దూకుడు అమెరికాలో అంతంతమాత్రమే.. బాహుబలి మొదటి భాగం… లాంగ్ రన్లో దాదాపు ఏడు మలియన్ డాలర్ల వసూళ్లను అందుకొంది అమెరికాలో. ఈ సినిమా రంగస్థలం వసూళ్లను రీచ్ అయితే అదే గొప్ప. 3.5 మిలియన్ డాలర్ల వసూళ్లతో ఆల్‌టైమ్ లిస్ట్‌లో రంగస్థలం మూడో స్థానంలో ఉంది. మొదటి రెండు స్థానాలు బాహుబలి చిత్రాలవి. మరి ఇది రంగస్థలం వసూళ్లను క్రాస్ చేసి మూడో స్థానంలో నిలబడుతుందా అనేది చూడాలి.
రంగస్థలం ..సింగిల్ లాంగ్వేజ్ మూవీ. ఇది అమెరికాలో తెలుగుతో పాటు హిందీ, తమిళ, మలయాళ భాషల్లో విడుదలైంది. ఇప్పటి వరకు లెక్కిస్తున్న వసూళ్లన్ని నాలుగు భాషలకి కలిపి. సింగిల్ లాంగ్వేజ్ వసూళ్లను లెక్కిస్తే…1.5 మిలియన్‌కి మించి ఉండవట. అదీ అమెరికాలో సాహో వసూళ్ల సత్తా!